- Telugu News Photo Gallery Cinema photos Know why Vijay Deverakonda does not have a name tag in Tollywood Industry Telugu Heroes Photos
Vijay Devarakonda: అవునా.? నిజామా.? విజయ్ దేవరకొండ పేరు ముందు ఎలాంటి ట్యాగ్ లేదా.?
నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు కూడా వాళ్ల పేర్ల ముందు ఆ స్టార్.. ఈ స్టార్ అంటూ ట్యాగ్స్ ఉన్నాయి. మరి ఇంత క్రేజ్ వచ్చినా.. అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకున్నా.. విజయ్ దేవరకొండకు మాత్రమే ఎందుకింకా ఆ ట్యాగ్ రాలేదు.. అసలు విజయ్ పేరు ముందు ట్యాగ్ లేకపోవడానికి కారణమేంటి..? దీనిపై విజయ్ రియాక్షన్ ఏంటి..? విజయ్ దేవరకొండ.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. పేరుకు మీడియం రేంజ్ హీరో అంటారు.
Updated on: Apr 01, 2024 | 3:51 PM

నిన్నగాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన హీరోలకు కూడా వాళ్ల పేర్ల ముందు ఆ స్టార్.. ఈ స్టార్ అంటూ ట్యాగ్స్ ఉన్నాయి. మరి ఇంత క్రేజ్ వచ్చినా.. అదిరిపోయే మార్కెట్ సొంతం చేసుకున్నా.. విజయ్ దేవరకొండకు మాత్రమే ఎందుకింకా ఆ ట్యాగ్ రాలేదు..

కానీ సరైన హిట్ పడితే మాత్రం టాప్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని కలెక్షన్లు తీసుకొచ్చే క్రేజ్ విజయ్ సొంతం. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా.. ఈ రేంజ్ ఇమేజ్ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంది.

కానీ సరైన హిట్ పడితే మాత్రం టాప్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని కలెక్షన్లు తీసుకొచ్చే క్రేజ్ విజయ్ సొంతం. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా.. ఈ రేంజ్ ఇమేజ్ చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే ఉంది.

అది వాళ్ల గౌరవానికి, ప్రస్టేజ్‌కు ప్రతీక అయిపోయింది. కానీ ఇంత ఇమేజ్ ఉన్నా.. విజయ్ పేరు ముందు ఎలాంటి ట్యాగ్ లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.

దీనిపై ఇప్పుడు స్పందించారు రౌడీ బాయ్. గత రెండు మూడు సినిమాల నుంచి తనకు ఏదో ఓ ట్యాగ్ ఇవ్వాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని.. కానీ అది తనకిష్టం లేదంటున్నారు విజయ్.

తనకు ఫ్యాన్స్ తనపై చూపించే ప్రేమ.. వాళ్లు ముద్దుగా పిలిచే రౌడీ పదమే చాలంటున్నారు. అమ్మానాన్న పెట్టిన పేరు కంటే ఏ ట్యాగ్ గొప్పదేం కాదంటున్నారు ఈ హీరో. మొత్తానికి ట్యాగ్స్‌పై ఒక్కో హీరోకు ఒక్కో అభిప్రాయం ఉంటుంది.. విజయ్ రియాక్షన్ ఇది.