- Telugu News Photo Gallery Cinema photos Hero Suhas announce back to back movies updates after ambajipeta marriage band Success Telugu Heroes Photos
Suhas: వరసబెట్టి సినిమాలు చేస్తున్న సక్సెస్ హీరో.! నిర్మాతల గ్యారెంటీ హీరో సుహాస్.
కొందర్ని చూసినపుడు ఇతడేం హీరో.. ఈయన్ని చూడ్డానికి కూడా డబ్బులు పెట్టుకుని వస్తారా అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక అన్నట్లు.. ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలుసు..? ఇండస్ట్రీలో ఓ నటుడిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కమెడియన్‌గా మొదలై.. హీరోగా వరస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనెవరో తెలుసా..?
Updated on: Apr 01, 2024 | 2:59 PM

విజయ్ దేవరకొండతో పోటీపడుతున్న నేషనల్ క్రష్.!

ఇండస్ట్రీలో ఓ నటుడిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కమెడియన్‌గా మొదలై.. హీరోగా వరస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనెవరో తెలుసా...?

యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి ఇండస్ట్రీలో నిర్మాతలు నమ్మే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు.. దాన్ని చేసి చూపిస్తున్నారు సుహాస్.

కమెడియన్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి.. ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారీయన. ఈ మధ్యే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌తో ఓకే అనిపించిన సుహాస్.. తాజాగా మరో సినిమా మొదలు పెట్టారు.

మామూలుగా కమెడియన్ ఎవరైనా హీరోగా మారితే.. అతన్నుంచి కామెడీ సినిమానే ఊహిస్తాం. కానీ సుహాస్ అలా కాదు.. కలర్ ఫోటో నుంచే విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. కామెడీ కంటే ఎమోషన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కథలు ఎంచుకుంటున్నారు.

తాజాగా ఓ భామ అయ్యో రామా అనే కలర్ ఫుల్ లవ్ స్టోరీకి సైన్ చేసారు సుహాస్. రామ్ గోదాల ఈ సినిమాకు దర్శకుడు. V ఆర్ట్స్, చిత్రలహరి టాకీస్ బ్యానర్స్‌పై హరీష్ నల్లా, ప్రదీప్ సంయుక్తంగా సుహాస్ సినిమాను నిర్మిస్తున్నారు.

త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. జ్యో సినిమా ఫేమ్ మాళవిక మనోజ్ ఇందులో హీరోయిన్. దీనికంటే ముందు ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు సినిమాలతో త్వరలోనే రానున్నారు సుహాస్. మొత్తానికి చూడాలిక.. ఈయన జర్నీ ఇంకెంత దూరం వెళ్లనుందో..?




