- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna The Girlfriend Teaser Release update Telugu Actress Photos
Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో పోటీపడుతున్న నేషనల్ క్రష్.!
ఏప్రిల్ 5 అనగానే ఇప్పటిదాకా మూవీ లవర్స్ ఫోకస్ మొత్తం విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ మీదకే వెళ్లింది. కానీ, ఇప్పుడు ఉన్నపళాన అందరూ రష్మిక వైపు తలలు తిప్పుతున్నారు. ఏప్రిల్ 5న విజయ్‌కి ఓ రిలీజ్ ఉంటే, రష్మికకూ ఓ రిలీజ్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ సంగతేంటి అంటారా.? యానిమల్ సినిమా సక్సెస్ మీదున్నారు రష్మిక.కంఫర్ట్ జోన్ నుంచి అడుగు బయటపడితేనే బొంబాట్ అవుతుందని నమ్ముతున్నారు.
Updated on: Apr 01, 2024 | 2:31 PM

ఏప్రిల్ 5 అనగానే ఇప్పటిదాకా మూవీ లవర్స్ ఫోకస్ మొత్తం విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ మీదకే వెళ్లింది. కానీ, ఇప్పుడు ఉన్నపళాన అందరూ రష్మిక వైపు తలలు తిప్పుతున్నారు.

ఏప్రిల్ 5న విజయ్‌కి ఓ రిలీజ్ ఉంటే, రష్మికకూ ఓ రిలీజ్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ సంగతేంటి అంటారా.? యానిమల్ సినిమా సక్సెస్ మీదున్నారు రష్మిక.

కంఫర్ట్ జోన్ నుంచి అడుగు బయటపడితేనే బొంబాట్ అవుతుందని నమ్ముతున్నారు. యానిమల్ సినిమా తనకు అదే విషయాన్ని నేర్పిందన్నది నేషనల్ క్రష్ చెబుతున్న మాట.

కంఫర్ట్ జోన్ నుంచి అడుగు బయటపడితేనే బొంబాట్ అవుతుందని నమ్ముతున్నారు. యానిమల్ సినిమా తనకు అదే విషయాన్ని నేర్పిందన్నది నేషనల్ క్రష్ చెబుతున్న మాట.

ఆమె కెరీర్లో ఫస్ట్ టైమ్ మలయాళంలో డబ్బింగ్ చెప్పారు. ఆమె ఓన్ వాయిస్‌తో ఏప్రిల్ 5న ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ మలయాళం వెర్షన్ కూడా రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు.

గతంతో పోలిస్తే ఈ బర్త్ డే చాలా స్పెషల్ అంటున్నారు రష్మిక. తాను నేర్చుకున్న ఓ కొత్త విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆ మాత్రం ఆనందం ఉంటుందిగా మరి.. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోయే ఫ్యామిలీస్టార్ ఎలాగూ హిట్ అవుతుంది కాబట్టి..,

ముందుగానే విజయ్‌నీ, పరశురామ్‌నీ పార్టీ అడిగేశారు రష్మిక. ఇప్పుడు సేమ్ డేట్‌కి రిలీజ్ కాబోతున్న టీజర్ కోసం రష్మికను కూడా పార్టీ అడుగుతున్నారు ఫ్యాన్స్.




