- Telugu News Photo Gallery Cinema photos Along with Anupama Parameswaran, two other heroines have done guest roles in Tillu Square movie
Tillu Square: టిల్లుగాని వసూళ్లు.. 3 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతంటే.?
మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. రెండేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ డీజే టిల్లుకి సీక్వెల్ ఈ చిత్రం. ఈ సినిమా మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. టిల్లుగాడు మళ్లీ రెచ్చిపోయాడన్నది ప్రేక్షకుల మాట. ఈ చిత్రంలో అనుపమతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించారు. ఇది మూడో రోజు కూడా దూసుకుపోతుంది.
Updated on: Apr 01, 2024 | 10:40 AM

మొదటిరోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న టిల్లు స్క్వేర్ చిత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే దాదాపుగా 50 కోట్లకు చేరువైంది. ఎన్నో రోజులగా కళ తప్పిన థియేటర్లకు కాస్త ఉరటని ఇచ్చింది. పెద్ద సినిమాలు లేకపోవడంతో 200 కోట్లకు పైగా వసూళ్లు చేసే అవకాశం ఉంది.

మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ చిత్రంతో లిల్లీగా అను నటనకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇందులో చేసిన పాత్రకు మొదట్లో ఈ మలయాళీ కుట్టిపై విమర్శలు వచ్చినప్పటికీ సినిమా విడుదల తర్వాత ఈ బ్యూటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రేమికులు.

రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో రాధిక, టిల్లు కలిసి చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో టిల్లుగా సిద్దు డైలాగ్స్, రాధికగా నేహా అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీని సీక్వెల్ గానే వచ్చింది టిల్లు స్క్వేర్.

టిల్లు స్క్వేర్ నుంచి గతంలో విడుదలైన ఓ పాటలో గుట్టపైన ఉన్న రాధిక కాలేజీ అంటూ టిల్లు చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలో రాధిక కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించింది. రాధికతో టిల్లును చూసిన ప్రేక్షకుల విజిల్స్ తో థియేటర్లలో మోత మోగించారు.

ఇందులో అనుపమ, నేహాతో మరో కథానాయకి కూడా ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆమె ఎవరో కాదు టాక్సీవాలా చిత్రంతో కథానాయకిగా కుర్రాళ్ల మనసు దోచేసిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. దీంతో ఈ వయ్యారికి వరస సినిమాలు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంటున్నారు విశ్లేషకులు.

ఈ చిత్రం మూడోరోజు వసూళ్ల విషయానికి వస్తే రూ. 33 కోట్లు వరకూ షేర్, రూ. 55 కోట్లు వరకూ గ్రాస్ అందుకొన్నట్టు అంచన. తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు షేర్, వరల్డ్ వైడ్‌గా రూ. 8.50 కోట్లు ఈ మూవీ రాబట్టినట్టు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.




