IPL 2024: ఆ కుటుంబంలో కన్నీళ్లను మిగిల్చిన ఐపీఎల్.. రోహిత్ ఫ్యాన్స్ దాడిలో గాయపడిన సీఎస్కే అభిమాని మృతి

విషాదాన్ని నింపింది. రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఒక వ్యక్తి తల పగలకొట్టారు. అతను గత రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు వదిలాడు. మరణించిన వ్యక్తి కూడా చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని కావడం గమనార్హం

IPL 2024: ఆ కుటుంబంలో కన్నీళ్లను మిగిల్చిన ఐపీఎల్.. రోహిత్ ఫ్యాన్స్ దాడిలో గాయపడిన సీఎస్కే అభిమాని మృతి
IPL 2024
Follow us
Basha Shek

|

Updated on: Mar 31, 2024 | 9:23 PM

ఐపీఎల్ ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఒక వ్యక్తి తల పగలకొట్టారు. అతను గత రెండ్రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు వదిలాడు. మరణించిన వ్యక్తి కూడా చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని కావడం గమనార్హం. మహరాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆటను కేవలం వినోదంగా చూడాలని, ఇలా ఓ వ్యక్తిని కొట్టి చంపడం దారుణమంటూ క్రికెట్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతుడు బందుపంత్ బాపుసో తిబిలే , సాగర్ జాంగే, బల్వంత్ జాంగే లతో కలిసి బుధవారం (మార్చి 27) రాత్రి 10 గంటల సమయంలో IPL మ్యాచ్‌ (సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్) ని చూస్తున్నారు. హైదరాబాద్ ఇచ్చిన 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు అద్భుత శుభారంభం అందించారు. అయితే అతి తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడ్డాయి.ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ పతనం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని షాక్ కు గురి చేసింది. రోహిత్ ఔట్ చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారు. దీంతో సాగర్ జంజా, బల్వంత్ జంజా ఇద్దరూ నిరాశకు గురయ్యారు. కానీ అక్కడే కూర్చున్న సీఎస్‌కే అభిమాని బందుపంత్ టిబిలే రోహిత్ ఔట్‌తో సంబరాలు చేసుకున్నాడు. ఇది చూసిన సాగర్ జంజా, బల్వంత్ జంజాలకు కోపం వచ్చింది. వెంటనే వీరిద్దరూ బండుపంత్‌తో వాగ్వాదానికి దిగారు.

క్రమేపీ ఈ గొడవ ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే గొడవ తీవ్రరూపం దాల్చడంతో సాగర్, బల్వంత్ పక్కనే కర్రలు అందుకుని బండుపంత్‌ తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో బండుపంత్ చెవులు, ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది. తీవ్రంగా గాయపడిన బందుపంత్ టిబిలేను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక మూడు రోజుల తర్వాత అంటే ఆదివారం మృతి చెందాడు. టిబిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు, అల్లుడు, కొడుకు, మనుమలు, సోదరులు, సోదరీమణులు ఉన్నారు. నిందితులు సాగర్ జాంగే, బల్వంత్ జాంగేలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.