GT vs SRH, IPL 2024: మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్.. మోడీ స్టేడియంలో హైదరాబాద్‌కు పరాభవం
మొదటి రెండు మ్యాచుల్లో అదరగొట్టిన సన్‌రాజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్ లో నిరాశపర్చింది. ఆదివారం (మార్చి 31) అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది సన్ రైజర్స్. 163 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది
మొదటి రెండు మ్యాచుల్లో అదరగొట్టిన సన్‌రాజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్ లో నిరాశపర్చింది. ఆదివారం (మార్చి 31) అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది సన్ రైజర్స్. 163 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. గుజరాత్ విజయంలో డేవిడ్ మిల్లర్, సాయి సుదర్శన్ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. మిల్లర్ కేవలం 27 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా సాయి సుదర్శన్ అత్యధికంగా 45 పరుగులు చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 36 పరుగులతో రాణించాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇది రెండో విజయం కాగా హైదరాబాద్ కు రెండో పరాజయం. లక్ష్య ఛేదనలో గుజరాత్ తరఫున ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 25, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 36 పరుగులు చేశారు. సాయి సుదర్శన్ నిజమైన ఇంపాక్ట్ ప్లేయర్‌గా తనదైన ముద్ర వేశారు. సాయి 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 పరుగులు చేసి గుజరాత్ ను విజయ తీరాలకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్ గుజరాత్‌కు విజయాన్ని అందించారు. మిల్లరన్ 27 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 44 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, కెప్టెన్ పాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.
అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబైపై ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్ బ్యాటర్లు మోడీ స్టేడియంలో మాత్రం విఫలమయ్యారు. ఏ ఒక్కరూ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ చేరో 29 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు తీశాడు.
ఇరు జట్లు:
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే
ఇంపాక్ట్ ప్లేయర్స్:
సాయి సుదర్శన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, అభినవ్ మనోహర్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.
ఇంపాక్ట్ ప్లేయర్స్:
ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ రెడ్డి, ఉపేంద్ర యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..