DC vs CSK, Playing XI IPL 2024: వైజాగ్ వేదికగా ఢిల్లీ వర్సెస్ చెన్నై.. టాస్ గెలిచిన పంత్
Delhi Capitals vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 13వ మ్యాచ్ జరుగుతోంది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా, ఢిల్లీ మాత్రం మొదటి విజయం కోసం ఎదురుచూస్తోంది
Delhi Capitals vs Chennai Super Kings Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 13వ మ్యాచ్ జరుగుతోంది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో చెన్నై విజయం సాధించగా, ఢిల్లీ మాత్రం మొదటి విజయం కోసం ఎదురుచూస్తోంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబరిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు దాదాపు ఏడాది తర్వాత మళ్లీ క్రికెట్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ కెప్టెన్ గా ఆకట్టుకోలేకపోతున్నాడు.రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరి చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ఢిల్లీ ఖాతా తెరుస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరం. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ 29 సార్లు తలపడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ 19 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
వైజాగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “మేము మొదట బ్యాటింగ్ చేస్తాము. వికెట్ బాగుంది, మేము దానిని బ్యాటింగ్ ట్రాక్‌గా ఉపయోగించాలనుకుంటున్నాము. జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. కుల్‌దీప్ స్థానంలో పృథ్వీ షా, రికీ భుయ్ స్థానంలో ఇషాంత్ శర్మలను తీసుకున్నాం. మేము మంచి క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘ఈ పిచ్ గురించి పెద్దగా తెలియదు. అది ఎలా ఉందో చూద్దాం. విషయాలు సరళంగా ఉంచడానికి ప్రణాళిక అలాగే ఉంటుంది. మా టీమ్‌లో ఎలాంటి మార్పు లేదు’ అని అన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
Fan Love 💙❤️#DCvCSK #TATAIPL #IPLonJioCinema #JioCinemaSports pic.twitter.com/JuP11C4n2F
— JioCinema (@JioCinema) March 31, 2024
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఎన్రిక్ నార్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్):
Our Sunday Singam Squad! 🦁🔥#DCvCSK #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/Ry1lLboZez
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024
రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..