DC vs CSK, IPL 2024: ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించిన రిషభ్ పంత్.. వైజాగ్ లో సీఎస్కే టార్గెట్ ఎంతంటే?
రోడ్డు ప్రమాదం నుంచి కోలుకోని ఐపీఎల్ లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టులోని ఈ ఢిల్లీ బ్యాటర్ వైజాగ్ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ 17వ సీజన్ 13వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు
రోడ్డు ప్రమాదం నుంచి కోలుకోని ఐపీఎల్ లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ఆకట్టులోని ఈ ఢిల్లీ బ్యాటర్ వైజాగ్ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ 17వ సీజన్ 13వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ ల సహాయంతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు పంత్. ఐపీఎల్ కెరీర్‌లో పంత్‌కి ఇది 16వ అర్ధ సెంచరీ. అతనితో పాటు డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులుచేసింది.
కాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి సుమారు 15 నెలల నిరీక్షణ తర్వాత రిషబ్ పంత్ ఐపీఎల్‌లో పునరాగమనం చేశాడు. ప్రమాదం తర్వాత పంత్ మునుపటిలా ఆడలేడనే చర్చ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మరోవైపు, పంత్ తన ప్రత్యేకమైన ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా పంత్ హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ అభిమానులకు అద్బుతమైన ఆటను చూపించాడు. పంత్ కూడా మునుపటిలా ఆడగలమని నిరూపించాడు.
ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ లు జట్టుకు 93 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ సమయంలో, వార్నర్ తన ఐపిఎల్ కెరీర్‌లో 6500 పరుగులు పూర్తి చేసిన రికార్డును కూడా సృష్టించాడు.
The student impresses the master 🙌
Pant wowed the Vizag crowd with Thala watching closely 🤩#DCvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Dm5l85aUTD
— JioCinema (@JioCinema) March 31, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
The tide has turned at the Salt Lake 🤯🔥
The Marina Machans have turned things around in style 💙#MBSGCFC #ISL #LetsFootball #ISLonJioCinema #ISLonSports18 #ISLonVh1 #JioCinemaSports pic.twitter.com/gnC0a6o79d
— JioCinema (@JioCinema) March 31, 2024
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఎన్రిక్ నార్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్):
రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..