MI vs RR, IPL 2024: ‘కింగ్ ఆఫ్ ముంబై’.. రోహిత్ అభిమానుల నినాదాలతో దద్దరిల్లిన వాంఖడే.. వీడియో చూశారా?

ముంబయి, రాజస్థాన్‌ జట్ల కు ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్‌. అయితే ఇరు జట్లది భిన్నమైన పరిస్థితి.హార్దిక్ పాండ్యా సారథ్యంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఓడిపోయింది. సంజూ శాంసన్‌ సారథ్యంలో రాజస్థాన్‌ రెండు మ్యాచ్‌లు గెలిచింది. కాబట్టి ముంబైపై గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది రాజస్థాన్. అదే సమయంలో హోం గ్రౌండ్ లో సత్తా చాటి బోణి కొట్టాలనుకుంటోంది ముంబై.

MI vs RR, IPL 2024: 'కింగ్ ఆఫ్ ముంబై'.. రోహిత్ అభిమానుల నినాదాలతో దద్దరిల్లిన వాంఖడే.. వీడియో చూశారా?
Rohit Sharma
Follow us
Basha Shek

|

Updated on: Apr 01, 2024 | 8:25 PM

ఐపీఎల్ 17వ సీజన్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ముంబయి, రాజస్థాన్‌ జట్ల కు ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్‌. అయితే ఇరు జట్లది భిన్నమైన పరిస్థితి.హార్దిక్ పాండ్యా సారథ్యంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఓడిపోయింది. సంజూ శాంసన్‌ సారథ్యంలో రాజస్థాన్‌ రెండు మ్యాచ్‌లు గెలిచింది. కాబట్టి ముంబైపై గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది రాజస్థాన్. అదే సమయంలో హోం గ్రౌండ్ లో సత్తా చాటి బోణి కొట్టాలనుకుంటోంది ముంబై. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి ఇదే తొలి హోమ్ గ్రౌండ్ మ్యాచ్. అందువల్ల, వారి ముంబై జట్టుకు మద్దతుగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ అభిమానులు వాంఖడే స్టేడియం ముంగిట రచ్చ చేసారు. ‘కింగ్ ఆఫ్ ముంబై’, ‘ముంబైకా రాజా రోహిత్ శర్మ’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. క్రికెట్ అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపర్చాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో ముంబై ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. రోహిత్ తో పాటు నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్ కూడా సున్నా పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో ముంబై 14 పరుగులకే 3 కీలక టాపార్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇషాన్ కిషన్ (14) కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ముంబై 8 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (23), తిలక్ వర్మ (22) ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు.

వాంఖడే వెలుపల రోహిత్ అభిమానుల సందడి.. వీడియోలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..