MI vs RR, IPL 2024: ముంబై బోణి కొట్టేనా? టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI ఇదే
Mumbai Indians vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.
Mumbai Indians vs Rajasthan Royals Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మరోవైపు ముంబై ఇండియన్స్ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. కాబట్టి ముంబై ఇండియన్స్‌కు నేటి మ్యాచ్ చాలా కీలకం. హోం గ్రౌండ్ అయిన ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుండం హార్దిక్ సేనకు సానుకూలాంశం. మరి మూడో మ్యాచ్ లోనైనా ముంబై ఇండియన్స్ గెలుస్తుందా లేక రాజస్థాన్ రాయల్స్ విజయ పరంపర కొనసాగుతుందా అనేది చూడాలి. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు IPL చరిత్రలో 28 సార్లు తలపడ్డాయి. అందులో 15 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. మరి ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.
కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి ముంబై ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.
అశ్విన్ తో రోహిత్ శర్మ..
𝐅𝐢𝐫𝐬𝐭 𝐦𝐚𝐭𝐜𝐡 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐬𝐞𝐚𝐬𝐨𝐧 𝐚𝐭 𝐡𝐨𝐦𝐞! 🏟️
All the updates from the MI LIVE Blog, right here 👉 https://t.co/YlYy9GJ2sg#MumbaiMeriJaan #MumbaiIndians #MIvRR
— Mumbai Indians (@mipaltan) April 1, 2024
ఇరు జట్లు..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా.
ఇంపాక్ట్ ప్లేయర్లు:
డెవాల్డ్ బ్రూయిస్, నువాన్ తుషార, రొమారియో షెపర్డ్, నెహాల్ వధేరా, షామ్స్ ములానీ.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హీట్‌మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్లు:
రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్
First away game. Wankhede. 7:30 PM. Blockbuster loading! 🔥
📰Your #MIvRR preview:
— Rajasthan Royals (@rajasthanroyals) April 1, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..