AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు! ఆ కీలక మ్యాచ్ వాయిదా.. కారణమిదే

ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ పక్కాగా ఖరారైంది. అలాగే నిర్ణీత సమయానికి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్‌లు జరిగాయి. అలాగే తదుపరి మ్యాచ్‌లు కూడా నిర్ణీత సమయం ప్రకారం జరుగుతాయి.

IPL 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు అలెర్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు! ఆ  కీలక మ్యాచ్ వాయిదా.. కారణమిదే
IPL 2024
Basha Shek
|

Updated on: Apr 01, 2024 | 6:39 PM

Share

ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్ విడుదలైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్‌ పక్కాగా ఖరారైంది. అలాగే నిర్ణీత సమయానికి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్‌లు జరిగాయి. అలాగే తదుపరి మ్యాచ్‌లు కూడా నిర్ణీత సమయం ప్రకారం జరుగుతాయి. అయితే శ్రీరామనవవి పండగ సందర్భంగా ఐపీఎల్ షెడ్యూల్‌లో ఒక మార్పు జరగనుందని సమాచారం. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఏప్రిల్ 17న కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, మ్యాచ్‌ను వేరే చోటికి మార్చాలని BCCI పరిశీలిస్తోంది. దీనికి సంబంధించి ఫ్రాంచైజీలు, రాష్ట్ర క్రికెట్, ప్రసారకర్తలకు సమాచారం అందించారు. ఏప్రిల్ 17న రామ నవమి జరుపుకుంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కోల్‌ కతాలో అట్టహాసంగా వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు పోలీసులు భద్రత కల్పిస్తారా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల వాతావరణం ఉంటుంది. దీంతో మ్యాచ్‌ను వాయిదా వేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ మ్యాచ్ కోసం BCCI CAB అంటే అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌తో టచ్‌లో ఉంది.

17వ మ్యాచ్‌పై బీసీసీఐ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ను రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీలకు తెలియజేస్తామని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. మ్యాచ్ తేదీ, వేదిక మార్పులపై రాష్ట్ర క్రికెట్ సంఘం, పోలీసుల నిర్ణయం తర్వాతే బీసీసీఐ ఓ అడుగు ముందుకేస్తుందని అంటున్నారు. ఐపీఎల్‌లో 70 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. మిగిలిన ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్ తేదీలు కూడా ప్రకటించింది. మే 21, మే 22 తేదీల్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 24న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. లీగ్ రౌండ్‌లో ఒక్కో జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుండగా మే 19న లీగ్ స్టేజ్ ముగియనుంది.

ఇవి కూడా చదవండి

భద్రతా కారణాలతో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..