Athiya Shetty- KL Rahul: అతియా శెట్టి ప్రెగ్నెంట్‌! త్వరలోనే తండ్రి కానున్న క్రికెటర్ కేఎల్ రాహుల్!

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడా? అతని సతీమణి బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ లో. తాజాగా అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలు అతియా శెట్టి ప్రెగ్నెంట్ తో ఉన్నాయనేందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

Athiya Shetty- KL Rahul: అతియా శెట్టి ప్రెగ్నెంట్‌! త్వరలోనే తండ్రి కానున్న క్రికెటర్ కేఎల్ రాహుల్!
KL Rahul, Athiya Shetty
Follow us
Basha Shek

|

Updated on: Apr 01, 2024 | 4:53 PM

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడా? అతని సతీమణి బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనిస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ లో. తాజాగా అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి చేసిన వ్యాఖ్యలు అతియా శెట్టి ప్రెగ్నెంట్ తో ఉన్నాయనేందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అథియా శెట్టి , కేఎల్ రాహుల్ గతేడాది పెళ్లి పీటలు ఎక్కారు. జనవరి 23న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు హాజరైన అతియా తండ్రి సునీల్ శెట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. డాన్స్ దీవానే’ అనే రియాల్టీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు సునీల్. ఇటీవల జరిగిన ఈ రియాల్టీ షో ఎపిసోడ్‌కి ‘గ్రాండ్‌ మస్తీ విత్ గ్రాండ్ పేరెంట్స్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా కమెడియన్ భారతీ సింగ్’ సునీల్‌ సార్‌.. మీకు మనవడో, మనవరాలో పుట్టి తాతయ్యవి అయిపోయాక ఎలా ఉంటారు? అని అడిగింది. దీనికి సునీల్ శెట్టి ‘ఈ రియాల్టీ షో తదుపరి సీజన్‌కి వచ్చేటపుడు నేను తాతయ్యగా ఉంటాను’ అని ఆన్సర్ ఇచ్చాడు. ఆయన సరదాగా అన్నారో, సీరియస్‌గా అన్నారో తెలియదు కానీ చాలామంది నిజంగానే సునీల్ శెట్టి తాతగా ప్రమోషన్‌ పొందబోతునున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే అతియా- రాహుల్ శుభ వార్త వినిపించనున్నారని తమ అభిప్రాయాలు వ్యక్త చేస్తున్నారు.

‌ కేఎల్ రాహుల్ అతియా శెట్టి మొదట్లో మంచి స్నేహితులు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా చిగురించింది. 2021 రాహుల్ అతియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2023లో భారతీయ సంప్రదాయం ప్రకారం రాహుల్- అతియాల పెళ్లి జరిగింది. సునీల్ శెట్టికి చెందిన ఖండాలా ఎస్టేట్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది. ఇక క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతను లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

కూతురు అతియా శెట్టితో సునీల్ శెట్టి.. వీడియో..

View this post on Instagram

A post shared by GM MODULAR (@gmmodular)

భర్త కేఎల్ రాహుల్ తో అతియా శెట్టి..

View this post on Instagram

A post shared by KL Rahul👑 (@klrahul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..