AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాడు. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. అలాగే మలయాళ బ్లాక్ బస్టర్ ముంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ కూడా వెండితెరపై సందడి చేయనుంది. వీటితో పాటు సందీప్ కిషన్ ప్రాజెక్ట్- జెడ్, భరత నాట్యం, బహుముఖం లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Apr 01, 2024 | 7:49 PM

Share

విద్యార్థులకు పరీక్షలు అయిపోయాయి. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. దీంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఈ శుక్రవారం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాడు. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. అలాగే మలయాళ బ్లాక్ బస్టర్ ముంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ కూడా వెండితెరపై సందడి చేయనుంది. వీటితో పాటు సందీప్ కిషన్ ప్రాజెక్ట్- జెడ్, భరత నాట్యం, బహుముఖం లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. థియేటర్లలో పాటు ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోపీ చంద్ నటించిన భీమా. థియేటర్లలో మాస్ ఆడియెన్స్ ను మెప్పించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓటీటీలో ఏ మేర అలరిస్తుందో చూడాలి. ఇక బిగ్ బాస్ బ్యూటీ దివి నటించిన లంబసింగి కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే హనుమాన్ కన్న, తమిళ్, మలయాళ వెర్షన్లు ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటలో సందడి చేయనున్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న సినిమాలు

ఇవి కూడా చదవండి
  • టుగెదర్( వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02
  • ఫైల్స్‌ ఆప్‌ ది ఆన్‌ఎక్స్‌ప్లెయిన్‌డ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
  • రిప్ లే(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04
  • పారాసైట్- ది గ్రే(కొరియన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 0స్కూప్- ఇంగ్లిష్ సినిమా- ఏప్రిల్ 05

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02
  • భీమా (గోపీచంద్ సినిమా)- ఏప్రిల్ 5
  • హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • మ్యూజికా(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04
  • యే మేరీ ఫ్యామిలీ(వెబ్ సిరీస్)- సీజన్ 3- ఏప్రిల్ 04
  • హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05

యాపిల్ టీవీ ప్లస్

  • లూట్ సీజన్‌- 2(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
  • సుగర్(హాలీవుడ్ సినిమా) – ఏప్రిల్ 05

సోనీలివ్

  • ఫ్యామిలీ ఆజ్‌ కల్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03

జీ5 ఓటీటీ

  • ఫర్రీ- (హిందీ సినిమా)- ఏప్రిల్ 05

ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..