Kismat OTT: సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ ఫిల్మ్.. ‘కిస్మత్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్రస్తుతం థియేటర్లలో టిల్లు స్వ్కేర్ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్పైకి మరో కామెడీ చిత్రం వచ్చేసింది. టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్, నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కిస్మత్. ఫిబ్రవరి 2న ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. విడుదలకు ముందు హడావిడి కనిపించినా.. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు
ఓటీటీలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్.. హారర్ కంటెంట్ వెబ్ సిరీస్ చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఈమధ్య కామెడీ చిత్రాలు కూడా ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో టిల్లు స్వ్కేర్ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్పైకి మరో కామెడీ చిత్రం వచ్చేసింది. టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్, నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కిస్మత్. ఫిబ్రవరి 2న ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. విడుదలకు ముందు హడావిడి కనిపించినా.. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించారు. ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈసినిమా అంతగా మెప్పించలేకపోయింది. నటీనటుల యాక్టింగ్ అలరించినా.. ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవడంతో డిజాస్టర్ టాక్ అందుకుంది. అలాగే అటు కలెక్షన్స్ సైతం అంతగా రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికి వస్తే.. కార్తీక్ (నరేష్ అగస్త్య), అభి (అభినవ్ గోమటం), కిరణ్ (విశ్వదేవ్) ముగ్గురు స్నేహితులు బీటెక్ పూర్తిచేసుకుని ఊరికి వచ్చేస్తారు. రియా సుమన్ తో అటు నరేష్ ఆగస్త్య ప్రేమలో పడతాడు. ఇంట్లో వాళ్ల పోరు తట్టుకోలేక ముగ్గురు స్నేహితులు హైదరాబాద్ వచ్చేస్తారు. బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలని డబ్బులు పెడతారు. కానీ ఆ కంపెనీ మూతపడడంతో ముగ్గురి జీవితాలు కష్టాల్లో పడతాయి. ఆ తర్వాత వారికి ఇరవై కోట్లు దొరుకుతాయి. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురుయ్యాయి. ?.. ఆ డబ్బు ఎవరిది ? చివరకు ఆ డబ్బును ఏం చేశారు ? అనేది కిస్మత్ సినిమా స్టోరీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.