AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaami OTT: విశ్వక్ సేన్ ‘గామి’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'. ఇప్పటివరకు ఎక్కువగా లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాల్లోనే నటించిన విశ్వక్ ఇందులో సరికొత్తగా కనిపించాడు. విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో అఘోరా పాత్రలో నటించి మెప్పించాడు విశ్వక్. అడ్వెంచెరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గామి సినిమా మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Gaami OTT: విశ్వక్ సేన్ 'గామి' ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Vishwak Sen Gaami Movie
Basha Shek
|

Updated on: Apr 02, 2024 | 4:20 PM

Share

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. ఇప్పటివరకు ఎక్కువగా లవ్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాల్లోనే నటించిన విశ్వక్ ఇందులో సరికొత్తగా కనిపించాడు. విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ సినిమాలో అఘోరా పాత్రలో నటించి మెప్పించాడు విశ్వక్. అడ్వెంచెరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన గామి సినిమా మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తక్కువ బడ్జెట్ తో తీసినా సినిమాలోని విజువల్స్, వీఎఫ్ఎక్స్ హై లెవల్‌ లో ఉన్నాయంటూ ప్రశంసలు వచ్చాయి. ఇక ఎప్పటిలాగే విశ్వక్ తన నటనతో అదరగొట్టాడంటూ రివ్యూలూ వచ్చాయి. థియేటర్లలో భారీగానే వసూళ్లు రాబట్టిన గామి సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. విశ్వక్ సేన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకుంది. మొదట ఏప్రిల్ 5 వ తేదీ నుంచే గామి సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నారని ప్రచారం సాగింది. అయితే దీనిపై సదరు ఓటీటీ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా వస్తోన్న వార్తలప్రకారం గామి సినిమా మరో వారం ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి విశ్వక్ సినిమా ఓటీటీలోకి రానుందని టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

కార్తిక్ శబరీష్ నిర్మించిన గామి సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు చాందిని చౌదరి, అభినయ, మొహమ్మద్ సమద్, హారిక, దయానంద్ రెడ్డి, శాంతిరావు, మయాంక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించారు. కాగా క్రౌడ్ ఫండింగ్ విధానంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి దాదాపు ఆరేళ్ళు పట్టింది. గామి కథ విషయానికి వస్తే.. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమా రాలేదన్నాడు విశ్వక్ సేన్. అందుకు తగ్గట్టుగానే గామి ఓ డిఫరెంట్ సినిమాగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియెన్స్.

ఇవి కూడా చదవండి

జీ 5 లో గామి స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
ఆ రాశి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
పళ్లు ఊడిపోతే పోషకాహార లోపం! చిరునవ్వు వెనుక దాగున్న దీర్ఘాయువు
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
Ram Charan: 8 నుంచి 6 వరకు మాత్రమే నేను హీరోను!
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న స్టార్ హీరో
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
ఇప్పుడే సినిమా చూశా.. చాలా అద్బుతంగా ఉంది.. ఎన్టీఆర్ ప్రశంసలు
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే!
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వికెట్ కీపర్ బ్యాటర్ డైట్ ప్లాన్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా?
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే..వీడియో
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
ఇక బయటికి పో మిచెల్‌ను గ్రౌండ్‌ నుంచి గెంటేసిన కోహ్లీ
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌
రోహిత్‌కు వారే వెన్నుపోటు పొడిచారా ?? బాంబు పేల్చిన మాజీ ప్లేయర్‌