MI vs RR, IPL 2024: మళ్లీ ‘పరాగ్’ ప్రతాపం.. రాజస్థాన్ ఘన విజయం..ముంబైకు మూడో ఓటమి

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్‌ పాండ్య (34), తిలక్‌ వర్మ (32) పరుగులు చేశారు. యుజువేంద్ర చాహల్‌, బౌల్డ్‌ తలో మూడు వికెట్లు తీయగా, బర్జర్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్‌ కు దిగిన రాజస్థాన్ 15.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది

MI vs RR, IPL 2024: మళ్లీ 'పరాగ్' ప్రతాపం.. రాజస్థాన్ ఘన విజయం..ముంబైకు మూడో ఓటమి
Mumbai Indians Vs Rajasthan Royals
Follow us

|

Updated on: Apr 01, 2024 | 11:20 PM

ముంబయి ఇండియన్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 1) సొంత గడ్డపై రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఆ జట్టుకు చుక్కెదురైంది. ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలై, ఈ సీజన్ లో హ్యాట్రిక్ ఓటములను మూట గట్టుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్‌ పాండ్య (34), తిలక్‌ వర్మ (32) పరుగులు చేశారు. యుజువేంద్ర చాహల్‌, బౌల్డ్‌ తలో మూడు వికెట్లు తీయగా, బర్జర్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్‌ కు దిగిన రాజస్థాన్‌ 15.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న రియాన్‌ పరాగ్‌ (54) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబయికి ఇది హ్యాట్రిక్‌ ఓటమి కాగా, రాజస్థాన్‌కు హ్యాట్రిక్‌ విజయం. ఆకాశ్ మధ్వాల్ (20/3) చెలరేగినా, తక్కువ స్కోరు కావడంతో ముంబై జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ టోర్నీలో హార్దిక్ సేనుకు ఇది వరుసగా మూడో ఓటమి కాగా, రాజస్థాన్ కు హ్యాట్రిక్ గెలుపు.

ఈ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానానికి చేరుకుంది. . రాజస్థాన్ రాయల్స్ 6 పాయింట్లు సాధించడంతో పాటు రన్ రేట్ కూడా బాగానే ఉంది. మరో వైపు ఈ పరాజయంతో ముంబై ఇండియన్స్ రన్ రేట్ దెబ్బతింది. ముంబై ఇండియన్స్ ఖాతాలో 0 పాయింట్లు నెట్ రన్ రేట్ -1.423. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తదుపరి మ్యాచుల్లో ముంబై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు..

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జస్ప్రీత్ బుమ్రా, క్వేనా మఫాకా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

డెవాల్డ్ బ్రూయిస్, నువాన్ తుషార, రొమారియో షెపర్డ్, నెహాల్ వధేరా, షామ్స్ ములానీ.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి  జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), ర్యాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హీట్‌మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రోవ్‌మన్ పావెల్, తనుష్ కొటియన్, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.