- Telugu News Photo Gallery Cricket photos Rajasthan Royals Bowler Trent Boult Equals SRH Player Bhuvneshwar Kumar In Most Wickets In 1st Over In IPL History
IPL 2024: వాంఖడేలో కొత్త చరిత్ర.. బౌల్ట్ దెబ్బకు రికార్డులకే వణుకు.. భువీ కూడా వెనుకంజే
IPL 2024: ఈ మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన బౌల్ట్, ఇప్పుడు ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. బౌల్ట్ 80 ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లు నమోదు చేయగా, టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ 116 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
Updated on: Apr 02, 2024 | 8:58 AM

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 126 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రాజస్థాన్ పేసర్లు ముంబై బ్యాటర్లపై రైడింగ్‌లో సఫలమయ్యారు.

ముఖ్యంగా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే వికెట్లు తీయడంలో ప్రావీణ్యం సంపాదించిన రాజస్థాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కూడా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే 2 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు.

బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికే ముంబైకి ఓపెనర్‌గా వచ్చిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను దక్కించుకున్నాడు. రోహిత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

రోహిత్ తర్వాత వచ్చిన నమన్ ధీర్ కూడా తర్వాతి బంతికి అంటే తొలి ఓవర్ 6వ బంతికి ఎల్బీడబ్ల్యూగా చిక్కుకున్నాడు. దీనితో పాటు బౌల్ట్ తాను వేసిన తొలి ఓవర్‌లో జీరోకే ఇద్దరు బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. దీని ద్వారా ఐపీఎల్‌లో అద్వితీయ రికార్డు కూడా సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసిన బౌల్ట్.. ఇప్పుడు ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భారత స్పీడ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్‌తో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాడు.

బౌల్ట్, భువనేశ్వర్ కుమార్‌లు ఇప్పటి వరకు తొలి ఓవర్‌లో 25 వికెట్లు తీశారు. అయితే ఈ ఘనత సాధించేందుకు ఇద్దరు పేసర్లు తీసుకున్న ఇన్నింగ్స్ ను పరిశీలిస్తే.. బౌల్ట్ ముందున్నాడు.

బౌల్ట్ 80 ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లు నమోదు చేయగా, టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ 116 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

అంతేకాదు ఈ మ్యాచ్ తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు తీసిన బౌల్ట్.. తొలి ఓవర్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. బౌల్ట్ ఇప్పటివరకు 5 సార్లు ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఐపీఎల్ తొలి ఓవర్లో డేల్ స్టెయిన్, ప్రవీణ్ కుమార్, ఉమేష్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు.





























