- Telugu News Photo Gallery Cricket photos Hardik Pandya Became Second Captain To Lose First Three Matches As Mumbai Indians Captain check full list
Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఖాతాలో చెత్త రికార్డ్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్లలోనే ఐరన్ లెగ్
Hardik Pandya Records: రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమితో హార్దిక్ పాండ్యా చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, హార్దిక్ గతంలో హర్భజన్ సింగ్ పేరిట ఉన్న అవాంఛిత రికార్డును సమం చేశాడు. మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయాడు. మార్చి 27న హైదరాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.
Updated on: Apr 02, 2024 | 1:13 PM

ఐపీఎల్ 2024 (IPL 2024) మ్యాచ్ నం. 2014లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా జట్టు హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది.

ఈ ఓటమితో హార్దిక్ పాండ్యా చెత్త రికార్డును లిఖించాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వరుసగా మూడో మ్యాచ్‌లో ఓడిపోయిన హార్దిక్.. గతంలో హర్భజన్ సింగ్ పేరిట ఉన్న అవాంఛిత రికార్డును సమం చేశాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు.

మార్చి 24న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయాడు. మార్చి 27న హైదరాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది.

అంతకుముందు 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో హర్భజన్ సింగ్ మొదటి మూడు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించాడు. ఆ సమయంలో RCBపై ఐదు వికెట్ల తేడాతో, చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆరు పరుగులతో, పంజాబ్ కింగ్స్‌పై 66 పరుగుల తేడాతో ఓడిపోయింది.

హర్భజన్ సింగ్ IPL 2008లో ముంబై ఇండియన్స్‌కు మొదటి కెప్టెన్. ఆ తర్వాత ముంబై జట్టుకు షాన్ పొలాక్, సచిన్ టెండూల్కర్, డ్వేన్ బ్రావో, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్ కెప్టెన్‌గా ఉన్నాడు.

సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్ తొలుత 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి క్రీజులో నిలిచిన రియాన్ పరాగ్ 39 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి రాజస్థాన్‌కు విజయాన్ని అందించాడు.




