AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Rajkumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో శివన్న.. ఫ్యాన్స్‌లో ఆందోళన.. అసలు ఏమైందంటే?

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం (ఏప్రిల్ 1)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే శివరాజ్ కుమార్ ఎందుకు ఆస్పత్రిలో చేరారో ఇంకా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఆయనను చూసేందుకు మధు బంగారప్ప ఆస్పత్రికి వెళ్లారు. దీంతో శివన్న ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Shiva Rajkumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో శివన్న.. ఫ్యాన్స్‌లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
Shiva Rajkumar
Basha Shek
|

Updated on: Apr 01, 2024 | 8:54 PM

Share

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన సోమవారం (ఏప్రిల్ 1)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే శివరాజ్ కుమార్ ఎందుకు ఆస్పత్రిలో చేరారో ఇంకా కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఆయనను చూసేందుకు మధు బంగారప్ప ఆస్పత్రికి వెళ్లారు. దీంతో శివన్న ఆరోగ్యంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే డాక్టర్లు అందించిన సమాచారం ప్రకారం శివరాజ్ కుమార్ కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది. కేవలం జనరల్ చకప్ కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చినట్లు సమాచారం. మంగళవారం (ఏప్రిల్ 2) ఉదయం శివన్న డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా శివరాజ్‌కుమార్ చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు సినిమా పనులు. మరొకటి లోక్‌సభ ఎన్నికల ప్రచారం. శివరాజ్‌కుమార్ భార్య గీత ఈసారి షిమోగా లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అందుకే తన భార్య తరపున ప్రచారం చేసేందుకు పలు పట్టణాల్లో పర్యటిస్తున్నాడు శివన్న.

ప్రస్తుతం శివరాజ్‌కుమార్‌ వయసు 61 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన గీతా శివరాజ్‌కుమార్‌ తరఫున ప్రచారం చేస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా శివన్న కాస్త అలసిపోయి ఉండవచ్చు. ఈ కారణంగానే ఆయన జనరల్ చెకప్ నిమిత్తం ‘వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’లో చేరారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్యన శివరాజ్‌కుమార్‌ బ్యాట్‌ టు బ్యాక్‌ మూవీస్ కు ఓకే చెప్పాడు.తాజాగా ఆయన నటించిన ‘కరటక దమనక’ చిత్రం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించారు. ఆర్. చంద్రుని ‘ఆర్‌సి స్టూడియో’ ప్రొడక్షన్ హౌస్‌లో శివరాజ్‌కుమార్‌ నటించనున్నారు. దీని గురించి ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా ఆర్. చంద్రు సమాచారాన్ని పంచుకున్నారు. గతంలో శివరాజ్‌కుమార్‌ ‘మైలారి’, ‘కబ్జా’ సినిమాల్లో నటించారు. వీటికి చంద్రు దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

భార్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో శివరాజ్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.