Premalu OTT: అఫీషియల్.. ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లో ట్విస్ట్‌

ఇటీవల తెలుగు నాట చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించిన చిత్రం ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ తెలుగు ఆడియెన్స్ ను కూడా మెస్మరైజ్ చేసింది. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేమలు సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది.

Premalu OTT: అఫీషియల్.. ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లో ట్విస్ట్‌
Premalu Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2024 | 5:24 PM

ఇటీవల తెలుగు నాట చిన్న సినిమాగా రిలీజై సంచలనం సృష్టించిన చిత్రం ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ తెలుగు ఆడియెన్స్ ను కూడా మెస్మరైజ్ చేసింది. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేమలు సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. అందుకే తెలుగు సినిమాలను మించి కలెక్షన్లను సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచిందీ యూత్ లవ్ స్టోరీ.. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ప్రేమలు సినిమాలో స్లీన్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాతో మమితా బైజు ఒక్కసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇలా ఎన్నో విశేషాలతో కూడిన ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ఏప్రిల్ 12 నుంచి ప్రేమలు సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతానికి కేవలం మలయాళం వెర్షన్ కు సంబంధించి మాత్రమే క్లారిటీ ఇచ్చారు. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ప్రేమలు తెలుగు వెర్షన్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 12 నుంచే తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తుందని టాక్. అయితే దీనిపై ఇంకా ఆహా ఓటీటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫాహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీం, షమీర్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు. మరి థియేటర్లలో ప్రేమలు సినిమాను మిస్ అయ్యారా? లేదా ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 12వ తేదీ వరకు వెయిట్ చేయండి మరి.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

ఆహాలో తెలుగు వెర్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..