AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer: ఆట మొదలెడదామా? ఆహా ‘సర్కార్’ గేమ్ షోలో సుడిగాలి సుధీర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

బుల్లితెరపై స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటున్నాడు. ఈ కారణంగా స్మాల్ స్క్రీన్ కు పూర్తిగా దూరమయ్యాడు సుధీర్. పండగ షోలు, స్పెషల్ ఈవెంట్లలో తప్పా అతను బుల్లితెరపై కనిపించడం లేదు. ఇదిలా ఉంటే త్వరలోనే మరో ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు సుడిగాలి సుధీర్.

Sudigali Sudheer: ఆట మొదలెడదామా? ఆహా 'సర్కార్' గేమ్ షోలో సుడిగాలి సుధీర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Sudigali Sudheer
Basha Shek
|

Updated on: Apr 02, 2024 | 9:49 PM

Share

బుల్లితెరపై స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటున్నాడు. ఈ కారణంగా స్మాల్ స్క్రీన్ కు పూర్తిగా దూరమయ్యాడు సుధీర్. పండగ షోలు, స్పెషల్ ఈవెంట్లలో తప్పా అతను బుల్లితెరపై కనిపించడం లేదు. ఇదిలా ఉంటే త్వరలోనే మరో ఓటీటీ షోలోకి అడుగుపెట్టనున్నాడు సుడిగాలి సుధీర్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సర్కార్ గేమ్ షోకు హోస్టుగా వ్యవహరించనున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ‘కొత్త సర్కార్, సుడిగాలి లాంటి ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు! ఇక ఆట మొదలెడదామా! సర్కార్ సీజన్ ఫోర్.. కమింగ్ సూన్’ అంటూ ఈ షోలో సుడిగాలి సుధీర్ ప్రజెన్స్ కి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకుంది ఆహా ఓటీటీ. ఇందులో బ్లాక్ కలర్ సూట్ లో స్టైలిష్ గా కనిపించాడు సుధీర్.

ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న షోలలో ‘సర్కార్’ గేమ్ షో ఒకటి. ఈ గేమ్ షోకు సంబంధించి ఇప్పటివరకు మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. త్వరలోనే నాలుగో సీజన్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఇంతకుముందు స్ట్రీమింగ్ అయిన సర్కార్ మూడు సీజన్లకు ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే నాలుగో సీజన్ నుంచి అతను తప్పుకున్నాడు. ఇందుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో సర్కార్ నాలుగో సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు సుధీర్. ఇప్పటికే బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓటీటీలోనూ కొన్ని షోలు చేశాడు. మరి సర్కార్ గేమ్ షోను ఎలా ముందుకు తీసుకెళతాడో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘గోట్’ అనే సినిమాలో నటిస్తున్నారు సుధీర్. నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్యాచిలర్’ ఫేమ్ దివ్య భారతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

త్వరలోనే స్ట్రీమింగ్ అప్ డేట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
తెలుగునేలపై అరుదైన జాతి పాము.. బొమ్మలా నటిస్తూ.. దగ్గరకెళ్లగా..
తెలుగునేలపై అరుదైన జాతి పాము.. బొమ్మలా నటిస్తూ.. దగ్గరకెళ్లగా..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
కేవలం రూ.10 చెల్లిస్తే చాలు.. బస్సుల్లో 50 శాతం రాయితీ
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!
జీవితాంతం కూడబెట్టిన రూ.60 లక్షలు విరాళం.. శరీరం దానం!