DC vs KKR, IPL 2024: 7 ఫోర్లు, 7 సిక్సర్లు.. 217 స్ట్రైక్ రైట్‌తో వైజాగ్ తీరంలో ‘నరైన్’ తుపాన్.. వీడియో

సునీల్ నరైన్.. తన మిస్టరీ స్పిన్ తో మేటి బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టగల బౌలర్. అయితే ఈ కరేబియన్ ఆల్ రౌండర్ బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తాడు. ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో ఇలాంటిదే కనిపించింది. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చిత్తు చేశాడు

DC vs KKR, IPL 2024: 7 ఫోర్లు, 7 సిక్సర్లు.. 217 స్ట్రైక్ రైట్‌తో వైజాగ్ తీరంలో 'నరైన్' తుపాన్.. వీడియో
Sunil Narine
Follow us

|

Updated on: Apr 03, 2024 | 10:37 PM

సునీల్ నరైన్.. తన మిస్టరీ స్పిన్ తో మేటి బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టగల బౌలర్. అయితే ఈ కరేబియన్ ఆల్ రౌండర్ బ్యాట్ తోనూ మెరుపులు మెరిపిస్తాడు. ఐపీఎల్ 2024 16వ మ్యాచ్‌లో ఇలాంటిదే కనిపించింది. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను చిత్తు చేశాడు. కేవలం 21 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. అతని తుఫాను బ్యాటింగ్ కారణంగా, కోల్‌కతా స్కోరు కేవలం 45 బంతుల్లో 100 దాటింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. మొదటి ఐదు బంతుల్లో నరైన్ తన ఖాతాని కూడా తెరవలేదు. కానీ దీని తర్వాత అతను తన 16 బంతుల్లో పెను విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మకు చుక్కలు చూపించాడు. నాలుగో ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన ఇషాంత్ శర్మను సునీల్ నరైన్ చిత్తు చేశాడు. ఈ ఓవర్‌లో నరైన్ 3 సిక్సర్లు, 2 ఫోర్ల సహాయంతో మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు నరైన్. ఇషాంత్ వేసిన తొలి రెండు బంతుల్లో నరైన్ రెండు సిక్సర్లు బాదాడు. మూడో బంతికి ఫోర్‌ వచ్చింది. నాలుగో బంతి డాట్‌ కాగా, ఐదో బంతికి సిక్స్‌, ఆరో బంతికి ఫోర్‌ బాదాడు. దీంతో నరైన్ పవర్ ప్లేలోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి 10 ఓవర్లలో 135 పరుగులు చేసింది. ఇప్పటివరకు మొదటి 10 ఓవర్లలో కేకేఆర్ సాధించిన భారీ స్కోర్ ఇదే. నరైన్ ధాటికి కేకేఆర్ జట్టు కేవలం 11 ఓవర్లలో 150 పరుగులకు చేరుకుంది. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో నరైన్ తన అత్యుత్తమ స్కోరును కూడా నమోదు చేశాడు. అంతకు ముందు అతని అత్యుత్తమ స్కోరు కేవలం 75 పరుగులు. సునీల్ నరైన్ సెంచరీ చేస్తాడనుకున్నారు. అయితే 85 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ సునీల్ నరైన్ కు జీవనాదానం చేశాడు. ఇషాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో నరైన్ ఔటయ్యాడు. బంతి అతని బ్యాట్ అంచుకు తగిలి పంత్ క్యాచ్ పట్టాడు. అయితే అంపైర్ ఔట్ ఇవ్వలేదు లేదా పంత్ సకాలంలో రివ్యూ తీసుకోలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.

ఒకే ఓవర్ లో 26 రన్స్ కొట్టిన నరైన్ .. వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..