DC vs KKR, IPL 2024: వైజాగ్‌లో కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు

Delhi Capitals vs Kolkata Knight Riders: కోల్ కతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఢిల్లీ బౌలర్లను దంచికొట్టారు. మొదట ఓపెనర్ సునీల్ నరైన్‌ (39 బంతుల్లో 85, 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఊచకోత ప్రారంభిస్తే అతనికి రఘువంశీ ( 27 బంతుల్లో 54 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) సునామీలా చెలరేగాడు. ఇక ఎప్పటిలాగే ఆండ్రి రస్సెల్ ( 19 బంతుల్లో41, 4 ఫోర్లు, 3 సిక్స్ లు), రింకు సింగ్ (26; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు

DC vs KKR, IPL 2024: వైజాగ్‌లో కోల్‌కతా బ్యాటర్ల విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు
Sunil Narine
Follow us

|

Updated on: Apr 03, 2024 | 10:01 PM

Delhi Capitals vs Kolkata Knight Riders: కోల్ కతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఢిల్లీ బౌలర్లను దంచికొట్టారు. మొదట ఓపెనర్ సునీల్ నరైన్‌ (39 బంతుల్లో 85, 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఊచకోత ప్రారంభిస్తే అతనికి రఘువంశీ ( 27 బంతుల్లో 54 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) సునామీలా చెలరేగాడు. ఇక ఎప్పటిలాగే ఆండ్రి రస్సెల్ ( 19 బంతుల్లో41, 4 ఫోర్లు, 3 సిక్స్ లు), రింకు సింగ్ (26; 8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరుకావడం గమనార్హం. గత వారంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు చేసింది. కోల్ కతా బ్యాటర్లు జోరు చూస్తుంటే SRH స్కోరు బద్దలయ్యేలా కనిపించినా.. ఆఖరుల్లో ఢిల్లీ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో కోల్ కతా 272 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నోకియా 3, ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్‌ తలో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి

టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా  బ్యాటింగ్ తీసుకున్నాడు. అందుకు తగ్గట్టే ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ 4.3 ఓవర్లలో 60 పరుగులు చేశారు. ఫిలిప్ సాల్ట్ 12 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత సునీల్ నరైన్, అంగ్రీష్ రఘువంశీ జోడీ కోల్‌కతా బౌలర్లను చీల్చి చెండాడారు. వీరిద్దరూ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సునీల్ నరైన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. అంగ్రీష్ రఘువంశీ 27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. వీరికి రస్సెస్, రింకూ సింగ్ లు కూడా ఆడడంతో కేకేఆర్ రికార్డు స్కోరు చేసింది.

‘సునీల్ నరైన్ సంచలన ఇన్నింగ్స్.. వీడియో

కోల్‌కతా నైట్ రైడర్స్( ప్లేయింగ్ -XI)

ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

ఇంపాక్ట్ ప్లేయర్:

సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్.

ఢిల్లీ క్యాపిటల్స్( ప్లేయింగ్ -XI)

పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్, రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్.

ఇంపాక్ట్ ప్లేయర్:

అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్