సుడి మాములుగా లేదుగా.. స్టార్ గా మారిన ఆమిర్ ఖాన్ ‘పీకే’ బిచ్చగాడు.. గర్ల్ ఫ్రెండ్ కూడా..

రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'పీకే' సినిమాలో 5 సెకన్లు మాత్రమే కనిపించే బిచ్చగాడి పాత్ర. ఆ పాత్రకి ఆడిషన్ కూడా జరిగింది! అవును, నిజమైన బిచ్చగాళ్లలో కొందరిని పిలిచి ఆడిషన్ చేశారు. అందులో మనోజ్ రాయ్ కూడా ఉన్నారు. ఆడిషన్ ప్రక్రియ, షూటింగ్ ముగిసే వరకు ఫ్రీగా ఆహారం లభిస్తుందనుకున్న మనోజ్ రాయ్ పీకేలో నటించడానికి వెంటనే అంగీకరించాడు.

సుడి మాములుగా లేదుగా..  స్టార్ గా మారిన ఆమిర్ ఖాన్ 'పీకే' బిచ్చగాడు.. గర్ల్ ఫ్రెండ్ కూడా..
Aamir Khan PK Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 03, 2024 | 7:37 AM

సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి. ఏమీ లేని వారు ఈ రంగంలో కోట్లాది రూపాయలు సంపాదించారు. అదే సమయంలో డబ్బులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం. ఒక నటుడు చేసిన చిన్న పాత్ర కూడా పెద్దగా ప్రభావం చూపిందనడానికి సినిమా ఇండస్ట్రీలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ చిత్రంలో బిచ్చగాడి పాత్ర పోషించిన నటుడి జీవితం కూడా ఎవరూ ఊహించలేని విధంగా మారిపోయింది. నిజ జీవితంలో భిక్షాటన చేస్తున్న మనోజ్ రాయ్ కి ఈ అవకాశం రావడం ఆశ్చర్యమైతే.. ఇప్పుడతను సోషల్ మీడియా స్టార్ గా అవతరించడం ఎవరూ ఊహించని విషయం. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘పీకే’ సినిమాలో 5 సెకన్లు మాత్రమే కనిపించే బిచ్చగాడి పాత్ర. ఆ పాత్రకి ఆడిషన్ కూడా జరిగింది! అవును, నిజమైన బిచ్చగాళ్లలో కొందరిని పిలిచి ఆడిషన్ చేశారు. అందులో మనోజ్ రాయ్ కూడా ఉన్నారు. ఆడిషన్ ప్రక్రియ, షూటింగ్ ముగిసే వరకు ఫ్రీగా ఆహారం లభిస్తుందనుకున్న మనోజ్ రాయ్ పీకేలో నటించడానికి వెంటనే అంగీకరించాడు.

మనోజ్ రాయ్ చాలా పేద కుటుంబం నుండి వచ్చాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి దినసరి కూలీగా పని చేస్తూ కొడుకును పెంచి పోషించాడు. అయితే తండ్రి అనారోగ్యం పాలవడంతో మనోజ్ చదువు మానేసి భిక్షాటన చేయడం ప్రారంభించాడు. ఉద్యోగం వెతుక్కుంటూ ఢిల్లీకి వచ్చినా ఉద్యోగం దొరకలేదు. అనంతరం ఢిల్లీ వీధుల్లో భిక్షాటన చేశాడు. అదే సమయంలో ఆమిర్ ఖాన్ ‘పీకే’ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో తనది 5 సెకన్ల పాత్ర అయినప్పటికీ మనోజ్ రాయ్ చాలా అద్భుతంగా నటించాడు. ఆమీర్‌ఖాన్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం అతని అదృష్టం. ఆ సినిమా విడుదలైన తర్వాత మనోజ్ రాయ్‌కు పాపులారిటీ పెరిగింది. కొంత డబ్బుకూడా వచ్చింది. ఆ డబ్బులు తీసుకుని మళ్లీ సొంతూరికి వెళ్లిపోయాడు. అక్కడ ఓ దుకాణంలో పనికి చేరాడు. అన్నట్లు అతనికి సోషల్ మీడియాలో అకౌంట్ కూడా ఉంది. గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. అలా పీకే సినిమాలో 5 సెకన్ల పాత్రలో మనోజ్ రాయ్ జీవితం రంగుల మయంగా మారిపోయింది.

ఆమీర్ ఖాన్ పీకే సినిమాలో మనోజ్ రాయ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.