Tollywood: పులిని చేతిలో పట్టుకున్న ఈ కుర్రాడు సూపర్ స్టార్.. ఇండస్ట్రీని శాసిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టగలరా ?..

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత.. పాత్ర బలం చూసి సహాయ నటుడిగానూ కనిపిస్తున్నారు. ఈరోజు తన 55వ పుట్టినరోజు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాతోనే ఇటు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఎవరో గుర్తుకువచ్చిందా ?..

Tollywood: పులిని చేతిలో పట్టుకున్న ఈ కుర్రాడు సూపర్ స్టార్.. ఇండస్ట్రీని శాసిస్తున్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actor
Follow us

|

Updated on: Apr 02, 2024 | 8:00 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత.. పాత్ర బలం చూసి సహాయ నటుడిగానూ కనిపిస్తున్నారు. ఈరోజు తన 55వ పుట్టినరోజు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఈ సినిమాతోనే ఇటు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఎవరో గుర్తుకువచ్చిందా ?.. అతడే బీటౌన్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్. ఈరోజు ఈ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా కాలం తర్వాత ఈ ఏడాది అజయ్ దేవగన్ కు ప్రత్యేకం. ఎందుకంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

ఇటీవలే ఆయన నటించిన ‘షైతాన్’ చిత్రం విడుదల కాగా ఇప్పుడు మైదాన్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 33 ఏళ్లుగా తన నట విశ్వరూపం చూపిస్తున్న అజయ్ దేవగన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా. అజయ్ దేవగన్ 1969 ఏప్రిల్ 2న ఢిల్లీలో పంజాబీ కుటుంబంలో జన్మించాడు. అసలు పేరు విశాల్ వీరూ దేవగన్. అతని తండ్రి వీరూ దేవగన్ స్టంట్ కొరియోగ్రాఫర్, యాక్షన్ మూవీ డైరెక్టర్. అతని తల్లి వీణా దేవగన్ నిర్మాత. అతని సోదరుడు అనిల్ దేవగన్ కూడా కథా రచయిత, దర్శకుడు. తల్లిదండ్రుల నుంచి భార్య, సోదరుడి వరకు అందరూ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. అజయ్ దేవగన్ ముంబైలోని సిల్వర్ బీచ్ హైస్కూల్లో చదువుకున్నాడు. ముంబైలోని మిథిబాయి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు.

1991లో వచ్చిన ‘ఫూల్ ఔర్ కాంటే’ చిత్రంతో సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఈ సినిమా నుంచి తన పేరును అజయ్‌గా మార్చుకున్నాడు. 1985లో మిథున్ చక్రవర్తి నిర్మించిన ‘ప్యారీ బ్రాహ్మణ’లో బాలనటుడిగా కనిపించాడు. ఇప్పటివరకు దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల్లోనూ నటించాడు. హీరోయిన్ కాజోల్ ను 1999లో వివాహం చేసుకున్నాడు. వీరికి అమ్మాయి నీసా, కుమారుడు యుగ్ ఉన్నారు. ఒక్కో సినిమాకు రూ. 60 కోట్లు పారితోషికం తీసుకుంటాడు. నివేదికల ప్రకారం అజయ్ దేవగన్ నికర విలువ దాదాపు రూ.540 కోట్లు. ముంబైలో విలాసవంతమైన బంగ్లా ఉంది. అజయ్ దేవగన్‌కు కార్లంటే చాలా ఇష్టం అలాగే పాతకాలపు వాహనాల సేకరిస్తాడు.

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్