AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Sitaram Panchal: ‘ఆస్కార్’ మువీలో నటించిన ఈ నటుడిని గుర్తుపట్టారా? చివరి రోజుల్లో దిక్కులేని స్థితిలో..

జీవితం అంతుచిక్కని ఓ చిక్కుప్రశ్న. దానికి సమాధానం కనుక్కోవాలని చేసే ప్రతి ప్రయత్నం మనల్ని వెక్కిరించి అబాసుపాలు చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొట్టుమిట్టాడుతుంది స్థిమితం లేని వెర్రి మనసు. ఈ లైఫ్‌లో సంతోషం, దుఃఖం ఏదీ శాశ్వతం కాదు. జీవితంలోని వచ్చే ప్రతి దశలో.. అది మంచిదైనా, చెడ్డదైనా అలా సాగిపోతూ ఉంటుంది. వద్దని దానికి బ్రేక్‌ వేయలేం. అలా కాలం ముందుకు వెళ్తే ఒకానొక సమయంలో..

Actor Sitaram Panchal: 'ఆస్కార్' మువీలో నటించిన ఈ నటుడిని గుర్తుపట్టారా? చివరి రోజుల్లో దిక్కులేని స్థితిలో..
Actor Sitaram Panchal
Srilakshmi C
|

Updated on: Apr 03, 2024 | 6:24 PM

Share

జీవితం అంతుచిక్కని ఓ చిక్కుప్రశ్న. దానికి సమాధానం కనుక్కోవాలని చేసే ప్రతి ప్రయత్నం మనల్ని వెక్కిరించి అబాసుపాలు చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొట్టుమిట్టాడుతుంది స్థిమితం లేని వెర్రి మనసు. ఈ లైఫ్‌లో సంతోషం, దుఃఖం ఏదీ శాశ్వతం కాదు. జీవితంలోని వచ్చే ప్రతి దశలో.. అది మంచిదైనా, చెడ్డదైనా అలా సాగిపోతూ ఉంటుంది. వద్దని దానికి బ్రేక్‌ వేయలేం. అలా కాలం ముందుకు వెళ్తే ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన ఓ నటుడిని విధి అన్యాయంగా నయవంచన చేసి, పాతాళానికి తొక్కేసింది. తెరపై అలరించి ఎన్నో హిట్‌ మువీల్లో నటించిన ఆ నటుడు నిజ జీవితంలో మాత్రం చిత్తుగా ఓడిపోయాడు. కాలానికి బందీ అయ్యి దిక్కుతోచని స్థితిలో కడు పేదరికంతో హాస్పిటల్‌ బిల్లు కూడా కట్టలేని స్థితిలో కన్నుమూశాడు.

ఆయన ఎవరో కాదు బాలీవుడ్‌ బడా స్టార్లు ఇర్ఫాన్‌ ఖాన్‌, అక్షయ్‌, అజయ్‌ దేవగడ్‌ వంటి ప్రముఖులతో నటించి నటుడు సీతారాం పంచల్. స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008), పీప్లీ లైవ్ (2010), ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002), జాలీ ఎల్‌ఎల్‌బి 2, పాన్ సింగ్ తోమర్ వంటి ఎన్నో చిత్రాలలో తన నటనతో మెప్పించిన సీతారాం పంచల్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాడు.

ఇవి కూడా చదవండి

తన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న ఈ నటుడు తీవ్ర అనారోగ్యంతో, కడు పేదరికంతో 10 ఆగస్టు, 2017న దిక్కులేని అనాథలా మరణించాడు. ఆయన జీవిత గాథ వింటే ప్రతిఒక్కరూ చలించిపోతారు.

నిజానికి నటుడు సీతారాం పంచల్ వరుస ఆఫర్లతో దూసుకు పోతున్న సమయంలో కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారీన పడ్డాడు. పంచల్‌కు 2014లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఆయుర్వేద పద్ధతుల్లో చికిత్స తీసుకున్నాడు. అదీ ఫలించలేదు. ఆ తర్వాత హోమియోపతి చికిత్సకు కూడా ఫలితం లేకపోగా మరింత ఎక్కువైంది. ఇలా తాను సంపాదించిన దంతా ఆస్పత్రి ఖర్చులకు ఉపయోగించినా క్యాన్సర్‌ నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో చేతిలో చిల్లిగవ్వలేక నాటి హర్యానా ప్రభుత్వాన్ని అర్ధించాడు. దీంతో ఆగస్టు 2017లో హర్యానా ప్రభుత్వం అతనికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించింది. CINTAA కూడా పంచల్ ఆన్‌లైన్‌ వేదికగా ఆర్ధిక సాయం కోరుతూ పోస్టు పెట్టింది. అయితే CINTAA కేవలం రూ. 1,06,575 ఫండ్లు మాత్రమే సేకరించ గలిగింది. చివరికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి నిలబడే శక్తి కూడా కోల్పోయాడు. ఆయన బరువు వేగంగా తగ్గిపోయి గుర్తుపట్టేలేకుండా మారిపోయాడు. 2017, ఆగష్టు 10వ తేదీన ఆయన కన్నుమూశారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.