AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: ఒక్క పూట అన్నం పెట్టినందుకు.. అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ

ఇప్పుడు అంటే పర్లేదు కానీ ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రావాలంటే ఎన్నో కష్టాలకు ఓర్చాలి. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవ్వకముందు కృష్ణవంశీ ఆకలి బాధలు అనుభవించారట. ఆ సమయంలో తనకు ఒక్క పూట అన్నం పెట్టాడు అని ఓ నటుడ్ని హీరోగా పెట్టి ఏకంగా సినిమా తీసాడు దర్శకుడు కృష్ణవంశీ. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Krishna Vamsi: ఒక్క పూట అన్నం పెట్టినందుకు.. అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ
Krishna Vamsi
Ram Naramaneni
|

Updated on: Apr 03, 2024 | 6:54 PM

Share

కృష్ణ వంశీ.. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. ప్రజంట్ సరైన విజయాలు లేక.. అవకాశాలు రాక బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. గులాబీ, నిన్నే పెళ్లాడత, చంద్రలేఖ, సింధూరం, అంత:పురం, సముద్రం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, మహాత్మ వంటి అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. కృష్ణ వంశీ చివరిగా తెరకెక్కించిన రంగమార్తాండ చిత్రం 2023లో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ.. కమర్షియల్ విజయం మాత్రం దక్కలేదు. పాత్రలను ఎప్పటికీ గుర్తిండిపోయేలా అద్భుతంగా డిజైన్ చేయడంలో కృష్ణవంశీ దిట్ట. కృష్ణవంశీ.. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ శిష్యుడు అన్న విషయం తెలిసిందే. ఆయన వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా ఓనమాలు నేర్చుకున్నారు. ప్రజంట్ డేస్‌లో అంత ఇబ్బందులు ఏం లేవు కానీ.. ఒకప్పుడు సినిమాల్లోని రాణించాలి అంటే చాలా కష్టాలు చవిచూడాల్సి వచ్చేది. ఎవరైనా ఒక టీ తాపిస్తే బాగుండు.. అన్నం పెట్టిస్తే బాగుండు అని ఎదురుచూస్తూ ఉండేవారు. సంవత్సరాల తరబడి నిరీక్షణ తర్వాత కొందిరికి అవకాశాలు దక్కేవి. అలానే కృష్ణవంశీ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలు కష్టాలు ఏంటో రూచి చూశారు. తన ఆకలి బాధలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

“అప్పటికీ అన్నం చేసి 5 రోజులు. కళ్లు మూతలు పడిపోతున్న పరిస్థితి. మరో 5 నిమిషాలు అయితే సొమ్మసిల్లి పడిపోయేవాడ్ని. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్న. తిరిగి ఊరెళ్లి పోవడం అంటే ఓడిపోయినట్లే. అలా చేయలేను. సరిగ్గా ఆ సమయంలో అటుగా నటుడు బ్రహ్మజీ వచ్చాడు. అన్నం తిందామా అని అడిగాడు. మామలుగా అయితే నాది రుణపడిపోయే మనస్థత్వం కాదు. ఎవరైనా అలా రమ్మని అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని. కానీ ఆకలి నన్ను బలహీనుడ్ని చేసింది. ఆ రోజు బ్రహ్మజీ పెట్టించిన ఫుడ్ తింటూ ఏమిస్తే ఇతని రుణం తీర్చుకోలను అనుకున్నా. ఆపై నేను దర్శకుడ్ని అయ్యాక సింధూరం చిత్రంలో బ్రహ్మజీని హీరోగా సెలక్ట్ చేయడానికి అది కూడా ఒక కారణం. అతడు మంచి యాక్టర్. నా స్నేహితుడు. క్యారెక్టర్‌కి సెట్ అవుతాడు అనిపించాడు. అందుకే హీరోని చేశాను” అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

Brahmaji

Brahmaji

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.