AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika OTT: పుస్తకంలోని పాత్రలు దెయ్యాలైతే.. ఆహాలో కాజల్ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం కరుంగా పియం. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీలో రైజా విల్సన్‌, యోగిబాబు, జనని తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. గతేడాది మే 19న థియేటర్లలో విడుదలైంది.

Karthika OTT: పుస్తకంలోని పాత్రలు దెయ్యాలైతే.. ఆహాలో కాజల్ హారర్‌ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Karthika Movie
Basha Shek
|

Updated on: Apr 03, 2024 | 6:25 PM

Share

టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం కరుంగా పియం. కార్తికేయన్‌ (డీకే) తెరకెక్కించిన ఈ మూవీలో రైజా విల్సన్‌, యోగిబాబు, జనని తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. గతేడాది మే 19న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత కార్తీక పేరుతో తెలుగులోనూ రిలీజై మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఒరిజెనల్ వెర్షన్ కరుంగా పియం ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడిదే హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియెన్స్ ను భయపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ఆహాలో కార్తీక సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 9 నుంచి ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన ఒక కొత్త వీడియోను అందులో పంచుకుంది.

ఇక సినిమా కథ విషయానికొస్తే.. కార్తీక (రెజీనా) సరదాగా ఓ ఓల్డ్‌ లైబ్రరీకి వెళుతుంది .అక్కడ వందేళ్ల క్రితం నాటి ‘కాటుక బొట్టు’ అనే పుస్తకం కనిపిస్తుంది. వెంటనే ఆ బుక్ ను చదవడం ప్రారంభిస్తుంది. అయితే ఆమె పుస్తకంలో చదివే పాత్రలన్నీ దెయ్యాలుగా మారి తన ముందుకు వస్తుంటాయి. అందులో కాజల్‌ (కార్తిక) కూడా ఉంటుంది. పగ తీర్చుకోవాలని దెయ్యంగా మారుతుంది. మరి కాజల్‌ ఎలా చనిపోయింది. తన పగను ఎలా తీర్చుకుంది? ఇందులో రెజీనా పాత్ర, కాజల్ తో సంబంధమేంటో తెలుసుకోవాలంటే కార్తీక మూవీని చూడాల్సిందే. థియేటర్లలో ఈ మూవీని మిస్ అయిన వారు ఓటీటీలో ఓ లుక్కేయండి మరి.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 9 నుంచి స్ట్రీమింగ్..

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న తంత్ర..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..