Tillu Square: అనుపమ ‘లిల్లీ’ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్

ఇప్పటివరకు ఎక్కువగా ట్రెడిషినల్ రోల్స్ లోనే నటించిన అనుపమ టిల్లు స్క్వేర్‌ లో మాత్రం చాలా బోల్డ్ గా, నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించింది. సినిమా రిలీజ్ కు ముందు ఆమెపై బాగా విమర్శలు వచ్చాయి. నెట్టింట ట్రోలింగ్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు లిల్లీ రోల్ తో అందరి చేత వావ్ అనిపించుకుంటోంది అనుపమ. అయితే టిల్లు స్క్వేర్‌ సినిమాలో హీరోయిన్ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Tillu Square: అనుపమ 'లిల్లీ' పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్
Tillu Square Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2024 | 8:05 PM

టిల్లు స్క్వేర్‌.. చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్న సినిమా. సుమారు రెండేళ్ల క్రితం రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన డీజే టిల్లుకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి పార్ట్ లో నటించిన సిద్దూ జొన్నల గడ్డే రెండో పార్ట్ లోనూ అదరగొట్టాడు. అయితే సీక్వెల్ లో నేహా శెట్టి బదులు అనుపమా పరమేశ్వరన్ వచ్చి చేరింది. లిల్లీ పాత్రలో ఈ మలయాళ బ్యూటీ అందం, అభినయానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా ట్రెడిషినల్ రోల్స్ లోనే నటించిన అనుపమ టిల్లు స్క్వేర్‌ లో మాత్రం చాలా బోల్డ్ గా, నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించింది. సినిమా రిలీజ్ కు ముందు ఆమెపై బాగా విమర్శలు వచ్చాయి. నెట్టింట ట్రోలింగ్ కూడా నడిచింది. అయితే ఇప్పుడు లిల్లీ రోల్ తో అందరి చేత వావ్ అనిపించుకుంటోంది అనుపమ. అయితే టిల్లు స్క్వేర్‌ సినిమాలో హీరోయిన్ కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. లిల్లీ రోల్ కు అనుపమా పరమేశ్వరన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆమె కన్నా ముందు యంగ్ సెన్సేషన్ శ్రీలీలను ఈ రోల్ కోసం సంప్రదించారట. ఆమె కూడా ఓకే చెప్పి షూట్ కు కూడా హాజరైందట. కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారట. అయితే తన రోల్ లో బోల్డ్ నెస్ ఎక్కువ ఉండడం, నెగెటివ్ క్యారెక్టర్ కావడంతో శ్రీలీల మధ్యలో నుంచే తప్పుకుందట.

దీంతో శ్రీలీల స్థానంలో అనుపమా పరమేశ్వరన్ ను తీసుకున్నారట మేకర్స్. ఈ విషయం తెలిసి సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న శ్రీలీల లిల్లీ పాత్రకు పెద్దగా సూట్ అయ్యేది కాదేమోనని అభిప్రాయపడుతున్నారు. నెగిటివ్ రోల్, బోల్డ్ నెస్ శ్రీలీలకు సూట్ అయ్యేవి కావని చెబుతున్నారు. ఒకవేళ శ్రీలీల ఈ సినిమా చేసి ఉన్నా అనుపమ రేంజ్ లో సక్సెస్ అయ్యేది కాదంటున్నారు. కాబట్టి ఈ యంగ్ సెన్సేషన్ టిల్లు స్క్వేర్‌ నుంచి తప్పుకుని మంచి పనిచేసిందంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

చిరంజీవితో టిల్లు స్క్వేర్ యూనిట్ .. ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.