Jagathi Babu: నాకు అవకాశాలు అందుకే రావడం లేదు.. జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
గతేడాది డిసెంబర్ లో విడుదలైన సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రలో కనిపించారు. అలాగే కన్నడలో సూపర్ హిట్ అయిన కాటేరా చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం జగ్గుభాయ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. ఈక్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతి బాబు. ఎన్నో సినిమాల్లో హీరోగా అలరించి.. ఇప్పుడు పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో దూరంగా ఉన్న జగపతి బాబు.. ఆ తర్వాత లెజెండ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ మూవీలో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించారు. ఇక ఆ తర్వాత పూర్తిస్థాయి విలన్ గా మారిపోయారు. విలన్ గానే కాకుండా సహాయ నటుడిగానూ కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రలో కనిపించారు. అలాగే కన్నడలో సూపర్ హిట్ అయిన కాటేరా చిత్రంలోనూ కీలకపాత్రలో కనిపించారు. ప్రస్తుతం జగ్గుభాయ్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటారు. ఈక్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తనకు చిన్న సినిమాలు చేయాలని ఉందని.. కానీ కొన్ని కారణాలతో అసలు అవకాశాలే రావడం లేదని అన్నారు. “నాకు చిన్న సినిమాలు చేయాలని కోరికగా ఉంది.. కమిటేడ్ గా చేస్తున్నారు. కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే.. నేను డబ్బున్న పేదవాడిని. నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. కానీ వాటి షూటింగ్స్ మాత్రం వాయిదా పడుతూనే ఉంటాయి. ఆ సినిమాలు ఉన్నాయ్ కదా అని నాకు వేరే అవకాశాలు రాలేడు లేదు.
మరోపక్క.. అమ్మో జగపతి బాబు పెద్ద సినిమాలు చేస్తున్నారు. చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇలా పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడం వల్ల నాకు అవకాశాలు రావడం లేదు. దీంతో అటు ఇటు కాకుండా అయిపోయా.. గతంలో రెండు మూడు సార్లు నా పని అయిపోయిందని అన్నారు. అప్పుడు ఓ స్టేజీలో నేను అనుకున్నారు. అది లెజెండ్ సినిమాకు రెండు మూడు నెలల ముందు. కానీ మీ జగపతి బాబు ఎక్కడికీ పోడు. వెళ్లినట్లు వెళ్లినా మళ్లీ వస్తూనే ఉంటాను” అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం జగపతి బాబు పుష్ప 2, సలార్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు.
Dabbunna Pedhavadini…..
Inko #Legend kosam Eduruchustuna. pic.twitter.com/C1GzB8RXrR
— Jaggu Bhai (@IamJagguBhai) April 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.