Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏపీ మహిళ మృతి.. రెండ్రోజుల వ్యవధిలోనే తల్లీకూతురు!

అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కారులో గుడికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా.. బాలిక తల్లి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సోమవారం (ఏప్రిల్‌ 1) మృతి చెందింది. వివరాల్లోకెళ్తే..

Road Accident: అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏపీ మహిళ మృతి.. రెండ్రోజుల వ్యవధిలోనే తల్లీకూతురు!
Andra Pradesh Woman In America
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 02, 2024 | 4:32 PM

కొణకంచి, ఏప్రిల్‌ 2: అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కారులో గుడికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా.. బాలిక తల్లి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో సోమవారం (ఏప్రిల్‌ 1) మృతి చెందింది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి గ్రామనికి చెందిన కమతం గీతాంజలి (32) భర్త, పిల్లలతో అమెరికాలో ఉంటోంది. ఆదివారం గీతాంజలి పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యులతో సహా అందరూ కారులో గుడికి వెళ్లారు. అనంతరం గుడి నుంచి తిరిగి వస్తుండగా వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లింది. ఈ రోడ్డు ప్రమాదంలో గీతాంజలి కుమార్తె హానిక బ్రెయిన్‌ డెడ్‌ అయి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాల పాలైన గీతాంజలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన భర్త నరేష్‌, కుమారుడు బ్రమణ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెలు రెండు రోజుల వ్యవధిలోనే మృతి చెందడంతో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. హానిక, గీతాంజలి మృతదేహాలను స్వగ్రామం ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

అరెస్ట్ వార్తల పై స్పందించిన సుప్రీత..
అరెస్ట్ వార్తల పై స్పందించిన సుప్రీత..
సినిమాలపై నటి హేమ సంచలన నిర్ణయం.. అదే కారణమా?
సినిమాలపై నటి హేమ సంచలన నిర్ణయం.. అదే కారణమా?
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తే వణకాల్సిందే.. పరారీలో ఆ ఇద్దరు..
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీత విలియమ్స్ సాహస యాత్రపై మెగాస్టార్ రియాక్షన్
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
సునీతాను భూమిపైకి తీసుకొచ్చేందుకు అన్ని కోట్లు ఖర్చు చేశారా?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
రూ. 50 లక్షలతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 'ట్రంప్ కార్డ్'?
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్..ఇప్పుడు తెలుగులో ఫేమస్ యాక్టర్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
అక్షరధామ్‌‌ను సందర్శించిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
శబరిమలలో మమ్ముట్టి కోసం మోహన్ లాల్ ప్రత్యేక పూజలు..
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ
కొలువుల కల్పవల్లికి ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు.. సక్సెస్ జర్నీ