AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nizam Sagar Canal: ఆర్మూర్‌లో తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట.. ఇళ్లలోకి ఏరులైపారిన నీళ్లు! వీడియో వైరల్

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిజాంసాగర్‌ కాలువ కట్ట సోమవారం (ఏప్రిల్ 1) తెల్లవారు జామున ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు పెద్ద ఎత్తున చేరింది. నడిరాత్రి వేళ ఒక్కసారిగి ఇళ్లలోకి నీళ్లు రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక బయటకు పరుగులు తీశారు. కాలువ తెగిపోవడంతో కాలనీలోని అనేక ఇళ్లలోకి నీరు పోటెత్తింది. పలు ఇండ్లలోని సామాన్లు..

Nizam Sagar Canal: ఆర్మూర్‌లో తెగిన నిజాంసాగర్‌ కాలువ కట్ట.. ఇళ్లలోకి ఏరులైపారిన నీళ్లు! వీడియో వైరల్
Nizam Sagar Canal Breached
Srilakshmi C
|

Updated on: Apr 01, 2024 | 6:39 PM

Share

ఆర్మూర్‌, ఏప్రిల్ 1: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిజాంసాగర్‌ కాలువ కట్ట సోమవారం (ఏప్రిల్ 1) తెల్లవారు జామున ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు పెద్ద ఎత్తున చేరింది. నడిరాత్రి వేళ ఒక్కసారిగి ఇళ్లలోకి నీళ్లు రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక బయటకు పరుగులు తీశారు. కాలువ తెగిపోవడంతో కాలనీలోని అనేక ఇళ్లలోకి నీరు పోటెత్తింది. పలు ఇండ్లలోని సామాన్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. నీటి ప్రవాహానికి విద్యుత్‌ స్తంభాలు సైతం పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది.

కాలువ కట్ట తెగిపోవడానికి ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఇరిగేషన్‌ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో మట్టిని తవ్వి కట్ట పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా తాగునీరు, పంట పొలాల సాగు కోసం చెరువులకు నీటిని వదులుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఆర్మూర్‌ ప్రాంతంలోని అధికారులు అవేవీ చేయకుండా బాధ్యతలు గాలికొదిలేశారు. దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలా తయారైంది. పెద్ద మొత్తంలో చెత్తా చెదారంతో నిండిపోయింది. ఈ క్రమంలో తాజాగా ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. దీంతో కాలువ కట్ట తెగి నీళ్లు కాలనీలోకి వెళ్లువెత్తాయి. కాలువను శుభ్రం చేయాలని అర్మూర్‌ వాసులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు