Hyderabad: నార్సింగిలో పోకిరీల వీరంగం! యువతిపై నీళ్లు.. నిలదీసినందుకు తండ్రి గొంతుకోసి పరార్‌

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. స్థానిక దుకాణంకి వెళ్లిన ఓ యువతిపై బహిరంగ ప్రదేశంలో నీళ్లు పోసి హేళన చేశారు. హోలీ రోజున తప్పించుకున్నావని ఇప్పుడు తప్పించుకోలేవని యువతిపై నీళ్లు కుమ్మరించారు. ఇదేంటని యువతి తండ్రి ప్రశ్నించగా పదునైన కత్తితో అతని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి నెమలినగర్‌లో..

Hyderabad: నార్సింగిలో పోకిరీల వీరంగం! యువతిపై నీళ్లు.. నిలదీసినందుకు తండ్రి గొంతుకోసి పరార్‌
Gang Attacked With Knife On Man
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 01, 2024 | 5:27 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 1: హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో పోకిరీలు వీరంగం సృష్టించారు. స్థానిక దుకాణంకి వెళ్లిన ఓ యువతిపై బహిరంగ ప్రదేశంలో నీళ్లు పోసి హేళన చేశారు. హోలీ రోజున తప్పించుకున్నావని ఇప్పుడు తప్పించుకోలేవని యువతిపై నీళ్లు కుమ్మరించారు. ఇదేంటని యువతి తండ్రి ప్రశ్నించగా పదునైన కత్తితో అతని గొంతు కోశారు. అడ్డొచ్చిన తల్లిపైనా కత్తితో దాడి చేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధి నెమలినగర్‌లో సోమవారం (ఏప్రిల్ 1) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌ శివారులోని నార్సింగి పరిధిలోని నెమలి నగర్‌కు చెందిన ఓ యువతి సోమవారం ఉదయం తన ఇంటికి సమీపంలోని దుకాణానికి కిరాణా సరుకుల కోసం వెళ్లింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సురేశ్‌ అనే వ్యక్తి, అతడి స్నేహితులు యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. హోలీ రోజు దొరకలేదంటూ ఆమెపై నీళ్లు పోసి హేళన చేశారు. పోకిరీల అసభ్యప్రవర్తన వల్ల అవమానంగా భావించిన యువతి భయంతో వారి నుంచి తప్పించుకుని ఏడుస్తూ ఇంటికి చేరింది. దుకాణానికి వెళ్లిన కుమార్తె ఏడుస్తూ రావడంతో ఏమైందని తల్లిదండ్రులు అడిగి జరిగిన విషయం తెలుసుకున్నారు.

దీంతో కోపోద్రిక్తుడైన యువతి తల్లిదండ్రలు పోకిరీల దగ్గరకు వెళ్లి నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో రెచ్చిపోయిన సురేశ్‌ ఫ్రెండ్‌ ప్రవీణ్‌ యువతి తండ్రి గొంతు కోశాడు. అడ్డొచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. పోకిరీల నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి తల్లిదండ్రులు నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేశ్‌, ప్రవీణ్‌లతో పాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 4 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..