Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గ్రేటర్‌లో నయా రికార్డు.. ప్రాపర్టీ ట్యాక్స్‌ విషయంలో..

గత ఆర్థిక సంవత్సవరం 2022-2023లో ఆస్తి పన్ను సేకరణ రూ. 1660 కోట్లతో పోలిస్తే 15.5 శాతం పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం అమలు ద్వారా ఆస్తి పన్ను పై 90 శాతం వడ్డీ మాఫీ ని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వచ్చా యి. పన్ను చెల్లింపుదారులను  ప్రోత్సహించడంతో ఈ ఏడాది...

Hyderabad: గ్రేటర్‌లో నయా రికార్డు.. ప్రాపర్టీ ట్యాక్స్‌ విషయంలో..
GHMC
Follow us
Vidyasagar Gunti

| Edited By: Narender Vaitla

Updated on: Apr 01, 2024 | 5:56 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లలో రికార్డు క్రియేట్ చేసింది. టార్గెట్ వైపు దూసుకెళ్లి గత వసూళ్లను బీట్ చేసింది. ఓటీఎస్ స్కీమ్ తీసుకొచ్చి వడ్డీపై 90 శాతం రాయితీతో మరిన్నీ వసూళ్లు రాబట్టింది బల్దియా. గత ఏడాది గణాంకాలను అధిగమించి జీహెచ్ఎంసీ అద్భుతమైన వసూళ్లను సాధించిందని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 257 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైంది. 2023-2024 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రూ.1810 కోట్లు కాగా.. ఇప్పటివరకు 1917 కోట్ల రూపాయల పన్ను వసూలు చేశారు.

గత ఆర్థిక సంవత్సవరం 2022-2023లో ఆస్తి పన్ను సేకరణ రూ. 1660 కోట్లతో పోలిస్తే 15.5 శాతం పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) పథకం అమలు ద్వారా ఆస్తి పన్ను పై 90 శాతం వడ్డీ మాఫీ ని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వచ్చా యి. పన్ను చెల్లింపుదారులను  ప్రోత్సహించడంతో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల పన్ను వసూళ్లు జరిగింది.ఆర్థిక సంవత్సరం చివరి రోజున 123 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు నమోదు అయింది.

బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు పలువురు బిఎల్‌ఓలు, బిఎల్‌ఓ సూపర్‌వైజర్ల వంటి కీలకమైన ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని అధిగమించామని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల వసూళ్లు సమిష్టి కృషితో సులభతరమైందని అన్నారు. బిల్ కలెక్టర్ లు, టాక్స్ ఇన్ స్పెక్టర్ లు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల సహకారం, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కేంద్ర పన్నుల విభాగం, ఐటి, ఆర్థిక విభాగాలు కీలకమైన పాత్ర పోషించాయని బల్దియా కమిషనర్ తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..