Shocking News: వామ్మో ఇదేం ఘోరం.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. 3 రాత్రులు శవాలతో గడిపి..!

అనుమానం పచ్చని కాపురాన్ని కకావికలం చేసింది. భార్యపై అనుమానంతో కట్టుకున్నోడు కన్న బిడ్డల కళ్లెదుటే దారుణంగా హత్య చేశాడు. పిల్లలు ఎక్కడ సాక్ష్యం చెబుతారనే అనుమానంతో ఇద్దరు బిడ్డలనూ హతమార్చి తన పాపానికి ఆధారాలు లేకుండా చేశాడు. కానీ విధి మాత్రం అతన్ని వదల్లేదు. పోలీలకు పట్టించి కటకటాలపాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నో జిల్లాలోని బిజ్నోర్‌ ఏరియాలోగల శరవణ్‌ నగర్‌ ఏరియాలో ఈ దారుణ ఘటన..

Shocking News: వామ్మో ఇదేం ఘోరం.. భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. 3 రాత్రులు శవాలతో గడిపి..!
Man Kills Wife And Two Kids
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 01, 2024 | 4:50 PM

లక్నో, ఏప్రిల్‌ 1: అనుమానం పచ్చని కాపురాన్ని కకావికలం చేసింది. భార్యపై అనుమానంతో కట్టుకున్నోడు కన్న బిడ్డల కళ్లెదుటే దారుణంగా హత్య చేశాడు. పిల్లలు ఎక్కడ సాక్ష్యం చెబుతారనే అనుమానంతో ఇద్దరు బిడ్డలనూ హతమార్చి తన పాపానికి ఆధారాలు లేకుండా చేశాడు. కానీ విధి మాత్రం అతన్ని వదల్లేదు. పోలీలకు పట్టించి కటకటాలపాలు చేసింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నో జిల్లాలోని బిజ్నోర్‌ ఏరియాలోగల శరవణ్‌ నగర్‌ ఏరియాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సౌత్ అడిషనల్ డీసీపీ శశాంక్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం..

లక్నో జిల్లాలోని బిజ్నోర్‌ ఏరియాలోగల శరవణ్‌ నగర్‌ ఏరియాలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోన్న రామ్‌లగన్‌ గౌతమ్‌ (32)కు భార్య జ్యోతి (30), ఇద్దరు పిల్లలు పాయల్‌ (6), ఆనంద్‌ (3) ఉన్నారు. రామ్‌లగన్‌ తాపీ పని చేసుకుంటూ కాపురాన్ని పోషించేవాడు. 14 ఏళ్ల క్రితం గౌతమ్‌ ముంబైలోని కళ్యాణ్‌పూర్‌లో పనిచేసేవాడు. అక్కడే స్థానికంగా ఉంటోన్న జ్యోతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ జంట లక్నోకు మారారు. సరోజినీ నగర్‌లోని గౌరీబజార్‌లో తాపీ మేస్త్రీగా పనికి కుదిరాడు. ఆ తర్వాత బిజ్నోర్‌లోని సర్వన్ నగర్‌లోని మరో అద్దె ఇంట్లోకి మారారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగినా ఈ మధ్యకాలంలో భార్య జ్యోతి తరచూ ఫోన్‌లో మాట్లాడుతుడంపై గౌతమ్‌కు అనుమానం మొదలైంది. జ్యోతి ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గౌతమ్‌ అనుమానించాడు. ఈ విషయమై భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. భార్య ఎంతచెప్పినా అనుమానం వీడని గౌతమ్‌ మార్చి 28న రాత్రి భార్యతో మరోమారు గొడవపడ్డాడు.

ఈ క్రమంలో పిల్లల కళ్ల ముందే నిద్రిస్తున్న జ్యోతిని, ఆమె చీర కొంగుతో మెడకు ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. భార్యను తానే చంపినట్లు పోలీసులకు ఎక్కడ చెబుతారోనని భయంతో ఇద్దరు పిల్లలను కూడా హత్య చేశాడు. అనంతరం రాత్రంతా ఆ ముగ్గురి మృతదేహాల పక్కనే గడిపి మరుసటి రోజు ఉదయం ఎప్పటి మాదిరిగానే తలుపుకు తాళం వేసి విధులకు వెళ్లిపోయాడు. సాయంత్రం తిరిగొచ్చి పడుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత మూడు రోజులు కూడా అదే రొటీన్‌ను కొనసాగించాడు. రోజూ రాత్రి అదే గదిలో పడుకుని పగలు పనికి బయటకు వెళ్లేవాడు. అయితే గౌతమ్‌ నివాసం ఉంటోన్న ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గది తాళం పగులగొట్టి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. సౌత్ డీసీపీ తేజ్ స్వరూప్ సింగ్, ఏడీసీపీ శశాంక్ సింగ్, కృష్ణానగర్ ఏసీపీ వినయ్ ద్వివేది సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు గౌతమ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సౌత్ అడిషనల్ డీసీపీ శశాంక్ సింగ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?