AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 కిలోమీటర్ల జర్నీకి ఆటో బుక్ చేశాడు.. కట్ చేస్తే.. బిల్లు చూసి దెబ్బకు కంగుతిన్నాడు.!

ఐదు కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించిన పాపానికి ఒక ప్రయాణికుడిని 3,59,45,507 రూపాయలు, అంటే అక్షరాలా మూడు లక్షల యాభై తొమ్మిది లక్షల, నలభై ఐదు వేల, ఐదు వందల ఏడు రూపాయలు కట్టమంది కార్లు, ఆటోలను ఆన్ లైన్ ద్వారా సరఫరా చేసే ఒక రవాణా సంస్థ. ఆ ఆటో మీటర్ చూసి షాక్ అయ్యాడు సదరు వినియోగదారుడు.

5 కిలోమీటర్ల జర్నీకి ఆటో బుక్ చేశాడు.. కట్ చేస్తే.. బిల్లు చూసి దెబ్బకు కంగుతిన్నాడు.!
Vizag
Eswar Chennupalli
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 02, 2024 | 4:28 PM

Share

ఐదు కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించిన పాపానికి ఒక ప్రయాణికుడిని 3,59,45,507 రూపాయలు, అంటే అక్షరాలా మూడు లక్షల యాభై తొమ్మిది లక్షల, నలభై ఐదు వేల, ఐదు వందల ఏడు రూపాయలు కట్టమంది కార్లు, ఆటోలను ఆన్ లైన్ ద్వారా సరఫరా చేసే ఒక రవాణా సంస్థ. ఆ ఆటో మీటర్ చూసి షాక్ అయ్యాడు సదరు వినియోగదారుడు. చివరకు రూ. 200 కట్టి బయటపడ్డాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీకి చెందిన ఎ.వి.ఎస్.ప్రసాదరావు రెండు రోజుల క్రితం వ్యక్తిగత పనులపై నగరంలోని హోటల్ మేఘాలయకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎంవీపీ కాలనీ రావడానికి తన మొబైల్‌లో ఉన్న ఓ రవాణా సంస్థకు చెందిన యాప్‌లో ఆటోను బుక్ చేశారు. ముందు అంచనా రూ. 200 చూపించింది. టూర్ ముగిశాక కేవలం ఐదు కిలోమీటర్ల దూరానికి 3,59,45,507 చూపిస్తూ బిల్ వచ్చింది. దాన్ని కట్టమన్నాడు ఆటో డ్రైవర్. అలా ఎందుకు వచ్చిందో తెలియదని, కట్టాల్సిందేనంటూ బెదిరించాడు. దీంతో ప్రసాదరావు ఆటోడ్రైవర్‌తో గొడవపడి ఆ సంస్థ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో తప్పు జరిగిందని తెలుసుకుని పొరపాటు జరిగిందన్నారు. 200 రూపాయలు కట్టాలని చెప్పారు. అలా అనగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు ప్రసాద్ రావు. ఇలాంటి సాంకేతిక సమస్య వచ్చినప్పుడు ఆయా సంస్థల సిబ్బంది వెంటనే స్పందించాలని కోరారు ప్రసాద్ రావ్.

డిజిటలైజేషన్ ఇబ్బందులు..

డిజిటలైజేషన్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయ్. ముఖ్యంగా కొన్ని సర్వీస్‌లలో ఇలాంటి వాటి వల్ల వినియోగదారులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ కోవకు చెందినదే ఈ స్టోరీ. ఉదాహరణకు గతంలో విద్యుత్ బిల్లులు కొంతమందికి అనూహ్యంగా వచ్చేవి. కేవలం రెండు బల్బ్‌లు ఉన్న సామాన్యులకు లక్షల్లో బిల్లులు వచ్చిన ఘటనలు చాలానే చూశాం. అనంతరం వాటిని సరిదిద్దిన ఘటనలు కోకొల్లలు. ఇలా డిజిటలైజేషన్ అయిన శాఖలలో ఇలాంటి బిల్స్ రావడం చాలా సహజమైన ప్రక్రియగానే మారింది.

Viral