YS Jagan: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరిన పలువురు నేతలు..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి బస్సుయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గొల్లపల్లి దగ్గర యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో మదనపల్లె చేరుకోనుంది. టిప్పు సుల్తాన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారుకు చేరుకుంటుంది బస్సు యాత్ర.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి బస్సుయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గొల్లపల్లి దగ్గర యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో మదనపల్లె చేరుకోనుంది. టిప్పు సుల్తాన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారుకు చేరుకుంటుంది బస్సు యాత్ర. రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం వైఎస్ జగన్..
కాగా.. వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సత్యసాయి జిల్లా చీకటిమునిపల్లె స్టే పాయింట్ దగ్గర ఏపీ సీఎం జగన్ సమక్షంలో పలువురు నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, అప్నా స్టేట్ అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి వైసీపీలో చేరారు.
ఇదిలాఉంటే.. ఉదయం 9గంటలకు చీకటిమనిపల్లె క్యాంప్ నుంచి బస్సుయాత్ర ప్రారంభం అవుతుంది. ములకల చెరువు, పెదపాలెం మీదుగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు చేరుకుంటారు సీఎం జగన్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..