Big News Big Debate: కరువుపై మాటల తూటాలు.. సర్కార్ కూల్చివేతపై సవాళ్లు..
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి... రోజుకింత పెరుగుతోంది. పూటకో అంశం.. ఎన్నికల ఎజెండాలో చేరుతూ.. పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఓవైపు కరువు మీద కయ్యం.. మరోవైపు మతంపేరిట మాటల మంటలు... అది చల్లారక ముందే సర్కారు కూల్చివేతలపై సవాళ్లు, ప్రతిసవాళ్లు...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి… రోజుకింత పెరుగుతోంది. పూటకో అంశం.. ఎన్నికల ఎజెండాలో చేరుతూ.. పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఓవైపు కరువు మీద కయ్యం.. మరోవైపు మతంపేరిట మాటల మంటలు… అది చల్లారక ముందే సర్కారు కూల్చివేతలపై సవాళ్లు, ప్రతిసవాళ్లు… అంతా కలిసి తెలంగాణ రాజకీయం ఇప్పుడు అగ్నిగుండాన్ని తలపిస్తోంది. పెరుగుతున్న వేసవితాపానికి తోడు… సెగలుగక్కుతున్న పొలిటికల్ పొగ.. జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.
ఇక కరెంట్ కోతలు, రైతుల ఆత్మహత్యలు, జంపింగ్ జపాంగ్‌లపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. చేసిన పాపాలను కడుక్కునేందుకే కేసీఆర్ ఫామ్‌హౌస్ వీడి బయటకు రావడం అభినందనీయం అంటూనే.. రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్‌కు ముఖ్యమంత్రి ఛాలెంజ్ విసిరారు. ఇద్దరు నేతల కామెంట్లు డైలాగ్ వార్‌లో చూద్దాం.