Actor Visweswara Rao: ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం
గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల మరణం ఇండస్ట్రీని కలచివేస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనేప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ, తెలుగు నటుడు, కమెడియన్ గరిమెళ్ళ విశ్వేశ్వర రావు (62) మంగళవారం..
గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల మరణం ఇండస్ట్రీని కలచివేస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనేప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ, తెలుగు నటుడు, కమెడియన్ గరిమెళ్ళ విశ్వేశ్వర రావు (62) మంగళవారం (ఏప్రిల్ 2) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వేశ్వరరావు చెన్నైలోని సిరుచ్చేరిలోని తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సిరుశేరిలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా నటుడు విశ్వేశ్వర రావు ఆరేళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ ప్రారంభించారు. ఆయన జీవితంలో దాదాపు 350కిపైగా చిత్రాల్లో నటించారు. వాటిల్లో బాలనటుడిగా 150కి పైగా సినిమాలు చేశారు. ఆ తర్వాత కాలంలో కామెడీ, సహాయక పాత్రలతో నటించి మంచి పేరు పొందారు. విశ్వేశ్వరరావు నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా పనిచేశాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాలు నటుడిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. సీనియర్ నటుడు విశ్వేశ్వరరావు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ.
తాజాగా ప్రముఖ చిత్ర కారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ అలియాస్ దాసి సుదర్శన్ (72) కూడా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మిర్యాలగూడలోని ఆయన ఇంట్లో గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. 1988లో వచ్చిన ‘దాసి’ సినిమాకు ఆయన ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. అప్పటినుంచి దాసి సుదర్శన్‌గా గుర్తింపు పొందారు. ఆయన చివరిగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ మువీకి మాటలు అందించారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.