Family Star: కొన్నేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని విజయ్.. ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొట్టేనా

గత ఐదేళ్లలో విజయ్ దేవరకొండ కెరీర్ ఎన్నో రెట్లు పెరిగింది.. ఇక దిల్ రాజు గ్రాఫ్ సైతం కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది.. కానీ ఇద్దరూ ఎంత సాధించినా ఒక్క విషయంలో మాత్రం ఆడియన్స్‌కు మాత్రం భారీగా బాకీ పడ్డారు. ఇప్పుడీ ఇద్దరికి ఆ బాకీ తీర్చే అవకాశం ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చింది. మరి దాన్ని ఫుల్ ఫిల్ చేస్తారా..? ఇంతకీ ఏంటా బాకీ..? సమ్మర్‌లో పెద్ద సినిమాల్లేవు.. ఉన్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ అదరగొడుతుంది. ఇక లైన్‌లో నెక్ట్స్ ఉన్నది విజయ్ దేవరకొండ.

| Edited By: Phani CH

Updated on: Apr 02, 2024 | 6:24 PM

గత ఐదేళ్లలో విజయ్ దేవరకొండ కెరీర్ ఎన్నో రెట్లు పెరిగింది.. ఇక దిల్ రాజు గ్రాఫ్ సైతం కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయింది.. కానీ ఇద్దరూ ఎంత సాధించినా ఒక్క విషయంలో మాత్రం ఆడియన్స్‌కు మాత్రం భారీగా బాకీ పడ్డారు. ఇప్పుడీ ఇద్దరికి ఆ బాకీ తీర్చే అవకాశం ఫ్యామిలీ స్టార్ సినిమాతో వచ్చింది. మరి దాన్ని ఫుల్ ఫిల్ చేస్తారా..? ఇంతకీ ఏంటా బాకీ..?

1 / 5
సమ్మర్‌లో పెద్ద సినిమాల్లేవు.. ఉన్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ అదరగొడుతుంది. ఇక లైన్‌లో నెక్ట్స్ ఉన్నది విజయ్ దేవరకొండ. రౌడీ బాయ్ కూడా మాస్ బ్యాటింగ్ చేయడానికి ఎప్రిల్ 5 నుంచి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ ఉన్నా.. యాక్షన్ కూడా ఉందని ట్రైలర చూస్తుంటే అర్థమైపోతుంది. పైగా ప్రమోషన్స్ కూడా నెక్ట్స్ లెవల్‌లో జరుగుతున్నాయి.

2 / 5
దిల్ రాజు బ్యానర్ అంటేనే ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అలాంటిదిప్పుడు టైటిలే ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు.. ఇక కుటుంబ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతున్నట్లే. పైగా దిల్ రాజు కూడా ఈ సినిమాపై చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. సాధారణంగా తన సినిమా ఏదైనా రిలీజ్‌కు ముందు గొప్పలు చెప్పరు దిల్ రాజు.. కానీ ఫ్యామిలీ స్టార్‌కు గొప్పలు కాదు కానీ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు.

3 / 5
శతమానం భవతి తర్వాత దిల్ రాజు కంపౌండ్ నుంచి ఆ స్థాయి ఫ్యామిలీ సినిమా రాలేదు. మధ్యలో శ్రీనివాస కళ్యాణం వచ్చినా ఆడలేదు.. విజయ్‌తో చేసిన వారసుడేమో తెలుగు సినిమా కాదు. ఎఫ్ 2 ఈ లోటు కాస్త తీర్చినా.. అందులో ఎక్కువగా కామెడీనే ఉంటుంది. మళ్లీ చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి ఎమోషన్స్‌తో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టారే.

4 / 5
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ ఫ్యామిలీ మూవీ ఇవ్వలేదు. పైగా అన్ని జోనర్స్ టచ్ చేస్తూ వస్తున్నారు. గతేడాది ఖుషీతో కుటుంబ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసినా.. పూర్తిస్థాయిలో వర్కవుట్ కాలేదు. దాంతో ఫ్యామిలీ స్టార్‌తో ఆ బాకీ తీర్చేయాలని చూస్తున్నారు. మరి ఇటు దిల్ రాజు.. అటు విజయ్ ఇద్దరూ ఇది చేస్తారా లేదో ఎప్రిల్ 5న తేలనుంది.

5 / 5
Follow us