Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో పాపం.. రైలులో టాయిలెట్‌కు వెళ్లేందుకు ఇతగాడి పాట్లు చూడండి! ఏకంగా స్పైడర్‌మ్యాన్‌ స్టంట్‌..

రైలు ప్ర‌యాణం చాలా మందికి మహా ఇష్టం. ఇతర మార్గాలతో పోల్చితే చవక. పైగా సౌకర్యవంతంగా హాయిగా ప్రయాణించవచ్చు. అందుకే సామాన్యులు మొదలు ధనవంతుల వరకూ అనేక మంది రైలులో ప్ర‌యాణిస్తుంటారు. ఇక పండగలు, సెలవు రోజుల్లో అయితే చెప్పక్కర్లేదు. రైళ్లన్నీ దాదాపు కిక్కిరిసిపోయి ఉంటాయి. వేసవి సెలవులు, లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం దాదాపుగా రైళ్లు అన్నీ కూడా ర‌ద్దీగానే క‌నిపిస్తున్నాయి. ర‌ద్దీగా ఉండే రైలులో కూర్చోని..

Viral Video: అయ్యో పాపం.. రైలులో టాయిలెట్‌కు వెళ్లేందుకు ఇతగాడి పాట్లు చూడండి! ఏకంగా స్పైడర్‌మ్యాన్‌ స్టంట్‌..
Spider Man In Train
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 02, 2024 | 3:23 PM

రైలు ప్ర‌యాణం చాలా మందికి మహా ఇష్టం. ఇతర మార్గాలతో పోల్చితే చవక. పైగా సౌకర్యవంతంగా హాయిగా ప్రయాణించవచ్చు. అందుకే సామాన్యులు మొదలు ధనవంతుల వరకూ అనేక మంది రైలులో ప్ర‌యాణిస్తుంటారు. ఇక పండగలు, సెలవు రోజుల్లో అయితే చెప్పక్కర్లేదు. రైళ్లన్నీ దాదాపు కిక్కిరిసిపోయి ఉంటాయి. వేసవి సెలవులు, లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం దాదాపుగా రైళ్లు అన్నీ కూడా ర‌ద్దీగానే క‌నిపిస్తున్నాయి. ర‌ద్దీగా ఉండే రైలులో కూర్చోని ప్ర‌యాణించ‌డం ఓ కల. ఎందుకంటే కనీసం నిలబడడానికి కూడా మహా కష్టంగా ఉంటుంది. అలాంటి రైలులో బాత్రూమ్‌కి వెళ్లాలని ఎవరూ కోరుకోరు. కానీ ఒకవేళ వెళ్లవల్సి వస్తే మాత్రం వారికి దాదాపు నరకం కనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి అలాంటి సాహసమే చేశాడు. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ట్రైన్‌లో బాత్రూంకి వెళ్లడానికి ఏకంగా స్పైడర్‌ మ్యాన్‌ అవతారం ఎత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ర‌ద్దీగా ఉన్న రైలులో ఓ ప్ర‌యాణికుడు బాత్‌రూంకు వెళ్లేందుకు అత‌డు వెళ్లిన విధానం చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ప్రయాణికుల తలల మీదుగా సీట్లపై భాగం నుంచి బ్యాలెన్స్‌ చేసుకుంటూ వాష్‌రూం వైపు మెల్లిమెల్లిగా వెళ్లసాగాడు. బాత్రూంకి వెళ్లేందుకు ట్రైన్‌ పాసింజర్‌ ఫీట్లు, పాట్లను మరో ప్యాసింజర్‌ ఫోన్‌లో వీడియో తీశాడు. అభినవ్ పరిహార్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్తా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. అత‌డు వెళ్లిన విధానం స్పైడర్ మ్యాన్‌ సినిమాలో హీరో చేసిన ఫీట్లు గుర్తుకొచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొందరు ఈ వీడియోపై జోకులు పేలుస్తుంటే.. మరికొందరేమో ట్రైన్‌ ర‌ద్దీ రోజుల్లో ఇదంతా మామూలేనని కొట్టిపారేస్తున్నారు. టికెట్‌ కొనకుండా ప్రయాణించేవారితోపాటు ట్రైన్ టికెట్‌ కొన్నవారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. కాగా 2023 జూన్‌లోనూ సరిగ్గా ఇలాంటి సీన్‌కు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియోలో కూడా ఓ వ్యక్తి బాత్రూంకి వెళ్లేందుకు స్టంట్ చేసుకుంటూ టాయిలెట్‌కు చేరుకోవడం కనిపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.