Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: 1991 నాటి ఏక్తా యాత్రను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ..

31 ఏళ్ల నాటి కల ఇప్పుడు సాకారమైందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల క్రితం ఏక్తా యాత్ర ప్రారంభించిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈదే విషయమై తాజాగా ఏక్తా యాత్రకు సంబంధించిన అలనాటి ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మోదీ ఆర్చివ్ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ప్రధాని మోదీ జీవితానికి సంబంధించిన..

PM Modi: 1991 నాటి ఏక్తా యాత్రను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ..
Narendra Modi
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 02, 2024 | 3:34 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1991 నాటి ఏక్తా యాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిని చారిత్రక ఘట్టం గురించి మోదీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

31 ఏళ్ల నాటి కల ఇప్పుడు సాకారమైందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల క్రితం ఏక్తా యాత్ర ప్రారంభించిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈదే విషయమై తాజాగా ఏక్తా యాత్రకు సంబంధించిన అలనాటి ఫొటోలను ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. మోదీ ఆర్చివ్ ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ప్రధాని మోదీ జీవితానికి సంబంధించిన అలనాటి ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఈ పేజీలో ఏక్తా యాత్రకు సంబంధించిన ఫొటోలను, న్యూస్‌ క్లిప్స్‌ను పంచుకున్నారు. ఈ ఫొటోల్లో నరేంద్రో మోదీ పలువురు సీనియర్‌ నాయకులతో కలిసి శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పుడు బీజేపీ కార్యకర్త అయిన మోదీ.. బీజేపీ నాయకులు మురళీ మనోహర్ జోషి నాయకత్వంలో జరిగిన ఏక్తా యాత్రికులతో కలసి భారతదేశాన్ని ఏకం చేసే ప్రయాణంలో భాగమయ్యారు. ఇందులో భాగంగా తమిళనాడు నుంచి అన్ని రాష్ట్రాల మీదుగా మట్టిని తీసుకుని వెళ్లారు. అలా 1992 జనవరి 26న కశ్మీర్‌లో జాతీయ జెండాని ఆవిష్కరించడంతో చరిత్రాత్మక ఘట్టం ముగిసింది.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులు క్రితం తమిళనాడు పర్యటనలో ఏక్తా యాత్ర గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ఏక్తా యాత్రకు సంబంధించిన రెండు లక్ష్యాలు నెరవేరాయన్నారు. ఇందులో ఒకటి శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌లో త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతుండడం కాగా, మరోకటి ఆర్టికల్‌ 370 రద్దు అని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..