Tamil Nadu: అన్నామలై మ్యాజిక్ చేస్తారా..? తమిళనాడులో లేటెస్ట్ టాక్ ఏంటంటే..
అది తమిళనాడులో మాత్రమే కాదు దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల చూపు తమిళనాట బిజెపి కూటమి పట్ల ఆసక్తిగా చూస్తోంది. ఏమాత్రం ఉనికి కూడా చూపలేని తమిళ గడ్డపై ఓ జాతీయ పార్టీ.. అందులోనూ హిందుత్వ పార్టీగా ముద్రపడిన బిజెపి ద్రవిడ వాదం...
తమిళ పాలిటిక్స్ ప్రస్తావన రాగానే అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే . ఈ రెండు పార్టీల పేర్లే అందరికి తెలుసు. ఇక ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేసే కాంగ్రెస్ సహా పదుల సంఖ్యలో ఉన్న పార్టీల ప్రస్తావన చాలా తక్కువేనని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు డీఎంకే అధికారంలో ఉండగా ప్రతిపక్ష ఎడిఎంకే కంటే ఇపుడు బిజెపి టాక్ ఎక్కువగా వినబడుతోంది.
అది తమిళనాడులో మాత్రమే కాదు దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల చూపు తమిళనాట బిజెపి కూటమి పట్ల ఆసక్తిగా చూస్తోంది. ఏమాత్రం ఉనికి కూడా చూపలేని తమిళ గడ్డపై ఓ జాతీయ పార్టీ.. అందులోనూ హిందుత్వ పార్టీగా ముద్రపడిన బిజెపి ద్రవిడ వాదం, హేతువాదం బలంగా వినిపించే పార్టీలు అధికారాన్ని ఏలుతున్న తమిళనాడులో ఈమాత్రం చర్చించే విధంగా ఉండడం చెప్పదగ్గ విషయమే. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలకు తొలిదశలోనే పోలింగ్ జరుగనుంది. అధికారంలో ఉన్న డీఎంకే కాంగ్రెస్ తో సహా వివిధ పార్టీలతో కలిసి పోటీ చేస్తోంది. డీఎంకే తమ కూటమిలోని పార్టీలకు టికెట్లు కేటాయించింది.
కాంగ్రెస్ కూడా ప్రతి ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన సీట్లతో సర్దుకుని పోటీలో ఉంటూ వస్తోంది. ఇక ఎడిఎంకే కూడా గతంలో బిజెపికి కొన్ని సీట్లు కేటాయించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. తమిళనాడులో తొలిసారిగా బిజెపి సొంతంగా కూటమిని ఏర్పాటు చేసి డీఎంకే తర్వాత బలమైన కూటమిగా బరిలో నిలిచింది. గతంలో బిజెపి నామమాత్రపు పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు తమిళనాడులో. కానీ బిజెపి తమిళనాడు చీఫ్ గా ఐపిఎస్ పదవిని వదులుకుని నియమితులైన అన్నామలై వచ్చాక పార్టీ పరిస్థితి మారింది అన్న చర్చ మొదలైంది.
ఆ మారిన పరిస్థితులే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత ఊపు ఆపార్టీల్లో కనబడుతోంది. ప్రజల్లో కూడా బిజెపి మాట వినబడుతోంది. ఈ సారి గట్టిగానే కొడతాం అనే ధీమా బీజేపీలో కనబడుతోంది. గత రెండేళ్లుగా అన్నామలై బాధ్యతలు తీసుకున్నాక ప్రజల్లో అనేక విషయాలపై చర్చించేలా కార్యక్రమాలు చేపట్టారు.. తమిళనాట ద్రవిడ వాదంతో పార్టీలు రాజకీయాలు చేస్తూవచ్చాయి. ప్రజల్లో ఆ భావన అసలు ఎక్కడా కనబడదు.. దశాబ్దాల క్రితం జరిగిన ద్రావిడ ఉద్యమం తాలూకు వాసనలతో పార్టీలు సెంటిమెంట్ గా రాణిస్తూ వస్తున్నాయి. నిజానికి తమిళనాడులో భక్తి భావం దక్షిణాదిలో ఎక్కడా లేనంతగా కనబడుతుంది. చారిత్రాత్మక ఆలయ కట్టడాలు మొదలు..
ఇప్పటి తరంలో గుడి లేని ఊరు కాదు.. వీధి కూడా చూడడం కష్టమే.. తిరుమల వచ్చే రద్దీతో 40 శాతం తమిళనాడు నుంచి వచ్చే భక్తులే ఉంటారు. ఇలాంటి వాటిపై లోతుగా గమనించిన అన్నామలై ద్రవిడ వాద మసక పోరాలను తొలగించాలి అంటూ రాష్ట్రవ్యాప్త పర్యటనలతో హిందుత్వ నినాదంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిది స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఇచ్చిన కౌంటర్లతో డీఎంకే ఇరకాటంలో పడింది.
ప్రజల్లో ఆ రకమైన చర్చ తీసుకురావడంలో అన్నామలై సక్సెస్ అయ్యారు. అలాగే గట్టి ఓటు బ్యాంకు కలిగిన పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి టికెట్లు కేటాయించి 21 స్థానాల్లో బిజెపి పోటీ చేస్తోంది. అన్ని విధాలుగా సామాజిక సమీకరణలో బలంగా ఉన్న పార్టీలను కూటమిగా ముందుకెళుతోంది. ఎడిఎంకే గతంలో లాగా బలం చూపే పరిస్థితి ప్రస్తుత కూటమిలో లేదు. ఎడిఎంకే నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇపుడు బీజేపీతో కలిశారు.
ఓపిఎస్ వర్గం పూర్తిగా ఇపుడు బిజెపికి సపోర్టగా నిలవడం కలిసొచ్చే అంశాల్లో ఇదొకటి. దీంతో అధికార డీఎంకే తర్వాత బలమైన పోటీ బిజెపి కూటమి అన్న విధంగా చర్చ జరుగుతోంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 3.66 శాతం ఓటుషేర్ కలిగిన బిజెపికి ఈసారి 20 శాతం ఓటు శాతం పెరగనుందన్న అంచనాలు ఉన్నాయి. అంటే సీట్లు కూడా డబుల్ డిజిట్ దక్కొచ్చు అన్న చర్చ జరుగితుండగా.. ఇదంతా బిజెపి చీఫ్ అన్నామలై మ్యాజిక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..