Delhi CM: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉత్కంఠ.. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన
ఇక జైల్ సే సర్కార్ అంటోంది ఢిల్లీలోని ఆప్ సర్కార్. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు 15 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించారు. జైలు నెంబర్ 2లో ఆయన ఉన్నారు. దీంతో జైలు నుంచే కేజ్రీవాల్ పాలన చేస్తారని ఆప్ ప్రకటించింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా అదే కారాగారంలో ఉన్నారు.
ఇక జైల్ సే సర్కార్ అంటోంది ఢిల్లీలోని ఆప్ సర్కార్. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు 15 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించారు. జైలు నెంబర్ 2లో ఆయన ఉన్నారు. దీంతో జైలు నుంచే కేజ్రీవాల్ పాలన చేస్తారని ఆప్ ప్రకటించింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా అదే కారాగారంలో ఉన్నారు. ఇప్పుడు జైలు నుంచే కేజ్రీవాల్…ఢిల్లీ సీఎంగా పరిపాలన చేస్తే, తిహార్ జైలును కటకటాల కేబినెట్‌గా మార్చినట్లే అంటున్నారు విశ్లేషకులు. తిహార్ జైలు నెంబర్ 2లో కేజ్రీవాల్ ఉన్నారు. సిసోడియాను జైల్ నెంబర్ వన్‌లో ఉంచారు. ఇక సత్యేంద్ర జైన్… జైల్ నెంబర్ 7లో ఉన్నారు.
అయితే తిహార్ జైలు నుంచే కేజ్రీవాల్ ఎలా పాలన సాగిస్తారనేది…ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. తిహార్ జైలు నెంబర్ 2కు కేజ్రీవాల్‌ను తరలించారు. జైల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జైలు బయట ఆప్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలు బ్యారక్‌లో కేజ్రీవాల్ ఒక్కరే ఉంటారు. కేజ్రీవాల్ సెల్ బయట నలుగురు పోలీసులు నిరంతరం సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. తిహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో ప్రత్యేక ఆహారం , మందులు, పుస్తకాలు అనుమతించాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 22వ తేదీన కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. తీహార్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను , ఆప్ మంత్రులను కలిశారు. అంతకుముందు కోర్టు హాల్‌లోకి వెళుతూ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ప్రధాని తీరు దేశానికి మంచిదికాదన్నారు. అయితే కేజ్రీవాల్ తన ఫోన్ పాస్‌వర్డ్ ఇవ్వడం లేదని ED కోర్టులో వాదించింది. కేజ్రీవాల్ తమకు సహకరించడం లేదని ED ఆరోపించింది. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్ తనకు రిపోర్ట్ చేయలేదని, మంత్రి అతిషికి రిపోర్ట్ చేసేవాడని కేజ్రీవాల్ విచారణలో వెల్లడించినట్టు ఈడీ తెలిపింది.
ఇక తిహార్ జైలు నుంచే కేజ్రీవాల్ పాలన చేస్తారని ఆప్ చెబుతోంది. ఆయన అక్కడి నుంచే ఫైళ్లపై సంతకాలు చేస్తారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను కూడా ఈడీ విచారిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ నేతలు తిహార్ జైలుకు క్యూ కడుతున్నారు. తిహార్ జైలు చరిత్రలో ఒకే పార్టీ నుంచి ఇంతమంది నేతలు అరెస్టు అవడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక సీఎంగా పనిచేసి జైలుకు వెళ్లిన నేతల్లో కేజ్రీవాల్ రెండో వారు. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా తిహార్ జైల్లో శిక్ష అనుభవించారు. ఇక మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, మరో మాజీ కేంద్ర మంత్రి రాజా, కరుణానిధి కుమార్తె కనిమొళి కూడా వివిధ కేసుల్లో తిహార్ జైలుకు వెళ్లారు. తాజాగా లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.