IPL Tickets: ఐపీఎల్ టికెట్ల పేరుతో సైబర్ నేరగాళ్ల దోపిడీ.!
టెక్నాలజీ అప్‌డేట్ అయినట్లే.. సైబర్ క్రిమినల్స్ కూడా దానికి మించిన రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. రోజుకో స్టైల్లో.. కొత్త కొత్త స్ట్రాటజీలతో అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఐపీఎల్ -2024 సందడి మొదలైనప్పటి నుంచి క్రికెట్ అభిమానులు జోష్ మీదున్నారు. దీనినే అవకాశంగా మలచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్ల పేరుతో మోసాలకు తెర తీసారు.
సీఎస్‌కే బరిలో దిగుతుందంటే డిమాండ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. రూ. 30 వేలు ఉన్న టికెట్‌ను బ్లాక్‌లో రూ. 50 వేల వరకు విక్రయిస్తున్నారంటే.. ఐపీఎల్ టికెట్లకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే మంచి అవకాశంగా భావించిన సైబర్ నేరగాళ్లు.. ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు క్లోజ్ అయిపోయాయి. అయినా సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో టికెట్లు ఉన్నాయని, కావాల్సినవారు బుక్ చేసుకోవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఏప్రిల్-5న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌కు టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు బుక్ చేసుకోవాలని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు వెంటనే ఆన్‌లైన్‌లో క్యూ కడుతున్నారు. సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్‌కు డబ్బులు పంపితేనే టికెట్లు అందజేస్తామని హామీ ఇస్తున్నారు. కొంతమంది అమాయక అభిమానులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో లబోదిబోమంటున్నారు. విషయం హెచ్‌సీఏ దృష్టికి వెళ్లింది. దీంతో ఐపీఎల్ టికెట్లపై అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే టికెట్లు క్లోజ్ అయిపోయాయని, ఆన్లైన్ లో ఐపీఎల్ టికెట్ల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని, టికెట్ల పేరుతో మోసం చేస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాల్సిందిగా హెచ్‌సీఏ ప్రకటించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.