Cyclone: మండు వేసవిలో తుపాను బీభత్సం.! వీడియో వైరల్.
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో తుపాను పెను బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా ఐదుగురు చనిపోయారు. మరో 100 మంది వరకు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని పలు చోట్ల బలమైన గాలులతో పాటు వడగళ్లు పడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో తుపాను పెను బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా ఐదుగురు చనిపోయారు. మరో 100 మంది వరకు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని పలు చోట్ల బలమైన గాలులతో పాటు వడగళ్లు పడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు నేలకొరిగాయి. కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు. తుపాను కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తుపాను ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. రెస్క్యూటీం సహాయ చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.