AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ముంబై ఇండియన్స్ ఊపిరి పీల్చుకో.. దుమ్ము రేపే ప్లేయర్ వచ్చేస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే

రోహిత్ వర్సెస్ హార్దిక్ కెప్టెన్సీ వివాదం ముంబై ఇండియన్స్ ఆటతీరుకు ప్రతిబంధకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు. అయితే ఈ పరిస్థితుల్లో ఆ జట్టుకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే

IPL 2024: ముంబై ఇండియన్స్ ఊపిరి పీల్చుకో.. దుమ్ము రేపే ప్లేయర్ వచ్చేస్తున్నాడు.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే
Mumbai Indians
Basha Shek
|

Updated on: Apr 03, 2024 | 8:41 PM

Share

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం సీజన్ లో విజయం కోసం ముఖం వాచేలా ఎదురుచూస్తోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. రోహిత్ వర్సెస్ హార్దిక్ కెప్టెన్సీ వివాదం ముంబై ఇండియన్స్ ఆటతీరుకు ప్రతిబంధకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఢీలా పడిపోయారు. అయితే ఈ పరిస్థితుల్లో ఆ జట్టుకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే వరల్డ్ టీ20 నంబర్ వన్ బ్యాటర్, విధ్వంసకర వీరుడు సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టులోకి రానున్నాడట. తదుపరి మ్యాచ్ కు స్కై అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్ సీ ఏ ప్రతినిధులు సూర్య కుమార్ యాదవ్ కు ఫిట్ నెస్ క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఏప్రిల్ 7 (ఆదివారం) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగే మ్యాచ సమయానికి టీ 20 స్పెషలిస్ట్ 100 శాతం ఫిట్ గా ఉంటాడని ఎన్ సీఏ అధికారులు నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.

కాగా మడమ, స్పోర్ట్స్‌ హెర్నియా సర్జరీల కారణంగా సూర్యకుమార్‌ యాదవ్‌ గత నాలుగు నెలలుగా క్రికెట్‌ గ్రౌండ్ కు దూరంగా ఉంటున్నాడు. అతనికి రెండు సర్జరీలు విజయవంతంగా పూర్తయ్యాయి. మార్చి నుంచి బెంగళూరులోని ఎన్‌సీఏ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు సూర్యకు ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించగా అందులో ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో జూన్ లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ 20 ప్రపంచ కప్ జరగనుంది. అందుకే సూర్య ఫిట్ నెస్ విషయంలో తొందర పాటు వద్దని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండో పరీక్షలో స్కై పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తేలడంతో ఎన్‌సీఏ అతనికి ఐపీఎల్‌ అడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూర్య కుమార్ యాదవ్ రాకతోనైనా ముంబై ఇండియన్స్ విజయాల బాట పడుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్, విష్ణు వినోద్, నెహాల్ వధేరా, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రెవిస్, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, తిలాకియో షెపర్డ్, వర్మ, జస్ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయెట్జీ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, ల్యూక్ వుడ్, క్వేనా మఫాకా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేస్తే.. ఎంత ముదురు మటన్ అయినా క్షణాల్లో ఉడికిపోయిద్ది..
ఇలా చేస్తే.. ఎంత ముదురు మటన్ అయినా క్షణాల్లో ఉడికిపోయిద్ది..
రూ.100 పెట్రోల్‌ కొడితే హీరో స్ప్లెండర్ ఎంత దూరం వెళ్తుందో తెలుసా
రూ.100 పెట్రోల్‌ కొడితే హీరో స్ప్లెండర్ ఎంత దూరం వెళ్తుందో తెలుసా
విజయవాడ ఉగ్రవాద కుట్ర కేసులో NIA ఛార్జిషీట్
విజయవాడ ఉగ్రవాద కుట్ర కేసులో NIA ఛార్జిషీట్
ఒక్క చుక్కతో రాత్రికి రాత్రే భయంకరమైన కాలి పగుళ్లు మాయం..
ఒక్క చుక్కతో రాత్రికి రాత్రే భయంకరమైన కాలి పగుళ్లు మాయం..
కళ్లలో కారం కొట్టి భర్తను హత్యచేసిన భార్య, కుమారుడు..
కళ్లలో కారం కొట్టి భర్తను హత్యచేసిన భార్య, కుమారుడు..
ఏకదంతుడికి 80 ఏళ్లు.. ఆ గ్రామంలో డీజేలు లేవు .. భజనలే హైలైట్
ఏకదంతుడికి 80 ఏళ్లు.. ఆ గ్రామంలో డీజేలు లేవు .. భజనలే హైలైట్
గణేశుడికి మోదకాలు కాదు.. బబుల్ టీ నైవేద్యం! థాయ్‌లాండ్‌లో వింత..
గణేశుడికి మోదకాలు కాదు.. బబుల్ టీ నైవేద్యం! థాయ్‌లాండ్‌లో వింత..
ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడంటే..?
ఐపీఎల్ 2027 మినీ వేలానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడంటే..?
సూర్యకాంతి లేకపోయినా సోలార్ బ్యాటరీ ఎన్ని గంటలు వస్తుంది?
సూర్యకాంతి లేకపోయినా సోలార్ బ్యాటరీ ఎన్ని గంటలు వస్తుంది?
ఆ విషయంలో ప్రధాని మోదీ గ్రేట్.. అమెరికా నిపుణుడి ప్రశంస
ఆ విషయంలో ప్రధాని మోదీ గ్రేట్.. అమెరికా నిపుణుడి ప్రశంస