Inspector Rishi OTT: ఓటీటీలో దూసుకుపోతోన్నక్రైమ్‌ థ్రిల్లర్ సిరీస్.. నైషనల్ వైడ్ టాప్‌లో .. ఎక్కడ చూడొచ్చంటే?

ఇతర జానర్లతో పోల్చితే ఓటీటీల్లో హార్రర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు బాగా ఆదరణ ఉంటుంది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరింది నవీన్ చంద్ర నటించిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్‍స్పెక్టర్ రిషి’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్

Inspector Rishi OTT: ఓటీటీలో దూసుకుపోతోన్నక్రైమ్‌ థ్రిల్లర్ సిరీస్.. నైషనల్ వైడ్ టాప్‌లో .. ఎక్కడ చూడొచ్చంటే?
Inspector Rishi Web Series
Follow us
Basha Shek

|

Updated on: Apr 03, 2024 | 8:14 PM

ఇతర జానర్లతో పోల్చితే ఓటీటీల్లో హార్రర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు బాగా ఆదరణ ఉంటుంది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరింది నవీన్ చంద్ర నటించిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్‍స్పెక్టర్ రిషి’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో మార్చి 29న ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, హారర్, క్రైమ్.. ఇలా ఆడియెన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇన్ స్పెక్టర్ రిషిలో ఉన్నాయి. తమిళంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. టీజర్స్, ట్రైలర్స్ తోనే బజ్ క్రియేట్ చేసిన ఇన్‍స్పెక్టర్ రిషి అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్‍ లిస్టులో టాప్ లో కొనసాగుతోంది ఇన్‍స్పెక్టర్ రిషి. సిరీస్ అందుబాటులోకి ఆరు రోజులైనా ఇప్పటికీ నంబర్ వన్ ప్లేస్ లోనే కొనసాగుతుండడం విశేషం. బయట రివ్యూలు కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ ఇన్ స్పెక్టర్ రిషి సిరీస్ పేరు మార్మోగిపోతోంది.

ఇన్‍స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‍కు నందిని జేఎస్ దర్శకత్వం వహించారు. అడవిలో జరిగే వరుస హత్యలను ఛేదించే ఇన్‍స్పెక్టర్ రిషి రోల్ లో హీరో నవీన్ చంద్ర పోషించారు. వీరితో పాటు సునైనా ఎల్లా, శ్రీకృష్ణ దయాల్, ఎలాంగో కుమారవేల్, కన్నా రవి, మాలినీ జీవరత్నం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సుఖ్‍దేవ్ లహరి ఈ సిరీస్ ను నిర్మించగా.. అశ్వత్ సంగీతం అందించారు. మరి ఓటీటీలో మంచి హార్రర్, క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్… ఇలా అన్ని అంశాలు కలబోసిన మంచి వెబ్ సిరీస్ ను చూడాలనుకుంటున్నారా? అయితే ఇన్ స్పెక్టర్ రిషిపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.