RR vs RCB, IPL 2024: కింగ్ కోహ్లీ సెంచరీ.. దెబ్బకు రికార్డులు బద్దలు.. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి ప్లేయర్‌గా..

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. మెరుపు సెంచరీ సాధించి బెంగళూరుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు

RR vs RCB, IPL 2024: కింగ్ కోహ్లీ సెంచరీ.. దెబ్బకు రికార్డులు బద్దలు.. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి ప్లేయర్‌గా..
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Apr 06, 2024 | 10:18 PM

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. మెరుపు సెంచరీ సాధించి బెంగళూరుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఐపీఎల్ 2024 సీజన్ లో ఇది మొదటి సెంచరీ. ఇక ధనాధన్ లీగ్ లో విరాట్ కోహ్లికి ఇది 8వ సెంచరీ. తద్వారా ఐపీఎల్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన వారి జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న క్రిస్ గేల్ 6 సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఈ మ్యాచ్ జరుగుతున్న జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో విరాట్ కోహ్లీకి ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ. అలాగే, ఐపీఎల్‌లో 8వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీకి రాజస్థాన్ రాయల్స్‌పై ఇది మొదటి సెంచరీ.

అలాగే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి విరాట్ కోహ్లీ తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సీజన్‌లో వీరిద్దరు నమోదైన అత్యధిక భాగస్వామ్యం కూడా ఇదే. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ జట్టుకు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అలాగే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 పరుగులు చేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్‌లో 7500 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఈ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు.

ఇవి కూడా చదవండి

కింగ్ కోహ్లీ సెంచరీ..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోపుల్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నంద్రా బర్గర్, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.