IPL 2024: రోహిత్ అద్భుతం.. హార్దిక్‌పై బురదజల్లడం తగదు.. ముంబై కెప్టెన్సీ వివాదంపై గంగూలీ
2024 సీజన్‌కు ముందు, రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్‌గా నియమించారు. ఇది రోహిత్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీని కారణంగా రోహిత్ ఫ్యాన్స్ చేతుల్లో నిత్యం ట్రోలింగ్ కు గురవుతున్నాడు హార్దిక్. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటి నుండి, ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్,..

ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఏదో ఒక వివాదం ఉంటుంది. అలా IPL 2024 సీజన్ కూడా వివాదాలతోనే ఆరంభమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బహుశా ఇది సీజన్ అంతటా అందరి నోళ్లలో నానుతూనే ఉంటుంది. అదే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ వివాదం. 2024 సీజన్‌కు ముందు, రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యాను ముంబై కెప్టెన్‌గా నియమించారు. ఇది రోహిత్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీని కారణంగా రోహిత్ ఫ్యాన్స్ చేతుల్లో నిత్యం ట్రోలింగ్ కు గురవుతున్నాడు హార్దిక్. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పటి నుండి, ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్, ఫ్రాంచైజీ యజమాని, కొత్త కెప్టెన్ నిరంతరం అభిమానుల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు మ్యాచుల్లో హార్దిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా, అతనిని తీవ్ర పదజాలతో దూషిస్తున్నారు.ఇది చాలా తప్పని పలువురు మాజీ క్రికెటర్లు ఈ విషయంపై స్పందిస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ముంబై తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 7 ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌లో క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న సౌరవ్ గంగూలీ, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రోహిత్ శర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉంటూనే రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా చేసిన గంగూలీ.. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్‌ను కెప్టెన్‌గా, విభిన్న స్థాయి ఆటగాడిగా అభివర్ణించాడు. టీమిండియా, ముంబయి కెప్టెన్‌గా రోహిత్ రికార్డు అద్భుతంగా ఉందని చెప్పాడు. దీంతో పాటు హార్దిక్ పాండ్యాను కూడా గంగూలీ ప్రశంసించాడు. IPLలో KKR కెప్టెన్సీ నుండి గంగూలీని తొలగించారు. అందుకే గంగూలీకి అలాంటి నిర్ణయాల గురించి బాగా తెలుసు. ఇది ఫ్రాంచైజీ నిర్ణయమని, ఏదైనా జాతీయ జట్టు లేదా క్లబ్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అదే జరుగుతుందని అతను ఈ అంశంపై స్పష్టంగా చెప్పాడు. హార్దిక్‌పై బురదజల్లడం తప్పని, అలా చేయకూడదని గంగూలీ అన్నారు. హార్దిక్‌కు మద్దతుగా గంగూలీ మాట్లాడుతూ..ముంబై కెప్టెన్‌గా చేయడంలో హార్దిక్ తప్పేమీ లేదని అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








